అదిలాబాద్

ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మార్చి 25: గ్రామస్థాయిలో చేపడుతున్న ఇంటి వద్ద చేపట్టే ప్రసవాలను అరికట్టి ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా ప్రజలలో అవగాహన తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను అదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన మెడికల్ ఆఫీసర్‌లు, సూపర్‌వైజర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ మాత శిశు సంరక్షణకు వైద్యాధికారులు, సిబ్బంది నిర్ధేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఆశా కార్యకర్తల నుంచి మొదలు ఎఎన్‌ఎం వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారి లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాసిపేట, తాండూర్, హాజీపూర్, వెంకట్రావ్‌పేట, ఆసుపత్రులలో ప్రసవాలు జరగని సిబ్బందికి విధులలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వౌళిక సదుపాయాలు, వసతులు ఏర్పర్చుకుని సాధ్యమైనంత వరకు ఆసుపత్రులలోనే కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అంబులెన్స్‌లను ఉపయోగించుకోని ఏరియాసుపత్రులకు అవసరమగు మేరకు పంపించాలన్నారు. వచ్చే శనివారం జరిగే ఆర్బి, ఎస్ బి వైద్య సిబ్బంది హాజరు కావాలని, హాజరు కాని సిబ్బందికి షోకాజీ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారిణి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి భీష్మా, ఏరియాసుపత్రి సూపరింటెండెంట్ యశ్వంత్, జిల్లా మహిళ, సంక్షేమ అధికారి రఫూఫ్‌ఖాన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.