అదిలాబాద్

రైతులు వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మార్చి 25: రైతులు తమ పంట ఉత్పత్తులను పెంచుకునేలా, స్థిరమైన ఉత్పత్తి సాధించేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులకు మెరుగైన సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో నూతనంగా నియమించబడిన వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయాధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యవసాయ రంగానికి ఎంతో అనుకూలంగా ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద గల సరస్వతి కాలువకింద పుష్కలంగా పంటలు పండుగుతున్నాయన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు, పత్తి, కందులు తదితర పంటలను రైతులు విరివిగా పండిస్తున్నారన్నారు. నాణ్యమైన విత్తనాలుంటే మంచి దిగుబడులు వస్తాయని, జిల్లాలో వ్యవసాయానికి ఎంతో అనుకూలమైన వాతావరణం, సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు నూతన టెక్నాలజీ ద్వారా అవగాహన కల్పించి రైతులు తమ ఉత్పత్తులను పెంచుకునేలా, నాణ్యత ప్రమాణాలు పెంపొందించుకుని సాగుబడిలో ఖర్చులు తగ్గించుకునేలా రైతులను చైతన్యపర్చాలన్నారు. అధికారులు తాము నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లోకి వెళ్లి డెమో ప్రదర్శనలు ఇచ్చి రైతులు పంట ఉత్పత్తులను పెంచుకునేలా సూచనలు అందించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ పంటల ఉత్పత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్, సీనియర్ వ్యవసాయ అధికారులు కృపాకర్‌రెడ్డి, భస్వారెడ్డి, లక్ష్మారెడ్డి, రాంచందర్‌రావు, మురళీధర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, బాపురెడ్డి, నర్సింగ్, తదితరులు కొత్తగా విధుల్లోచేరిన అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గంగారాం, ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, ఎడి కోటేశ్వర్‌రావు, డి ఈవొలు, ఎ ఓలు పాల్గొన్నారు.

ప్రత్యేక నిధుల పేరిట ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్న ప్రభుత్వం
* మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి
ఆదిలాబాద్ టౌన్, మార్చి 25: కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని కొనసాగించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధి అంటూ మోసం చేస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ది నిధి పేరిట కొత్తగా లబ్దిచేకూర్చేది ఏమి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 2013లోనే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్దికై ప్రతిపాదనలు రూపోందించడం జరిగిందని అన్నారు. వీటికి పేర్లుమారుస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి నిధి పేరిట ప్రచారం చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్ళ పాలనలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోగా ఎస్సీ ఎస్టీల అభివృద్దికి చేసిందేమి లేదన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అన్ని విధాల లబ్దిచేకూర్చడం జరిగిందన్నారు. సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్ళిస్తూ ఎస్సీ ఎస్టీల అభివృద్దిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని, కేవలం మాటలతో కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ దిగంబర్‌రావ్‌పాటిల్, కౌన్సిలర్లు అంబకంటి సుష్మ ఆశోక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భగీరథ పనులలో జాప్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
* జిల్లాకలెక్టర్ ఆర్వీ కర్ణన్
లక్సెట్టిపేట, మార్చి 25: మిషన్ భగీరథ పనులు కాంట్రాక్టర్లకు ఇచ్చిన గడువులోగా పనులను పూర్తి చేయాలని లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. శనివారం నాడు మండలంలోని జెండా వెంకటపూర్, బలరావుపేట గ్రామాలలో మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు నాణ్యతతో కూడిన పనులను చేయాలన్నారు. అలాగే త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికి నీరందించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనులను నిర్లక్ష్యం చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామస్తులతో కూడా ఆయన మాట్లాడగా గ్రామాలను గ్రామ పంచాయతీలు, డ్రైనేజీ పనులు చేపట్టకపోవడం వల్ల నీరంతా చేరి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు రోగాల బారిన పడే పరిస్థితి దాపురించిందని ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పనులను సకాలంలో చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామాలలో విద్యుత్ లైట్లు, రోడ్ల సౌకర్యాలు కూడా సరిగా లేవని ఆయన దృష్టికి తీసుకురావడంతో వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వేసవి కాలంలోగా ప్రతి ఇంటింటికి తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎడీవో రాంప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ డిఈ మల్లేషం గౌడ్, బిఈ అంజన్ రావు, ఎఈ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.