అదిలాబాద్

విధులలో అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, మార్చి 25: పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం చింతలమానేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించడంతో పాటు పోలీస్ సిబ్బందికి తమ సమస్యలు ఇబ్బందులను అడిగితెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారితో స్నేహ పూర్వకంగా మెలగాలని వారికి న్యాయంచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటైన పోలీస్‌స్టేషన్ కావడంతో ఏమైనా ఇబ్బందులున్న త్వరలోనే తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట డిఎస్పీ హాబీబ్ ఖాన్, కాగజ్‌నగర్ గ్రామీణ సి ఐ రమేష్ బాబు, చింతలమానేపల్లి ఎస్ హెచ్ ఓ హన్మండ్లు, సిబ్బంది ఉన్నారు.

రక్తమార్పిడి యంత్రం అందజేత
* సామాజిక కార్యక్రమాలో సింగరేణి
శ్రీరాంపూర్ రూరల్ మార్చి 25: సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పదకతలోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కుడా ముందుటుందని శ్రీరాంపూర్ జిఎం ఎస్‌డిఎం సుభానీ అన్నారు. శనివారం శ్రీరాంపూర్‌లో విలేఖర్లతో మాట్లాడారు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విజ్ఞప్తి మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 17.50 లక్షల విలువ గల సిరమ్ ఫెర్రిటిన్ లెవల్స్ మిషన్ అందజేయడం జరిగిందన్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 600 మంది తలసేమియా, సికిల్ సెల్ బారినపడి వైద్యం చేసుకుంటున్నారని, వీరంతా ప్రతి 15 రోజులకోకసారి రక్తమార్పిడి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రక్తమార్పిడి సమయంలో రక్తంలో ఐరన్ నిలువలు సరిచూసుకోవడం చాలా ముఖ్యమని, ఇందుకోసం ఈ మిషన్ అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే దివాకర్‌రావు, సంస్థ సిఎండి ఎన్.శ్రీ్ధర్‌ను కోరడంతో మానవతా దృక్పధంతో స్పందించి సింగరేణి సిఎస్‌ఆర్ నిధులనుండి మిషన్ కోనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేశారన్నారు. ఈ మిషన్ సత్వరం రావడానికి సింగరేణి డైరెక్టర్ జె.పవిత్రన్ కుమార్, జిఎం (పర్సనల్) మురళీసాగర్ ఎంతో కృషిచేసారన్నారు.

ప్రిన్సిపాల్స్ పదోన్నతులను వెంటనే చేపట్టాలి
ఆదిలాబాద్ టౌన్, మార్చి 25: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లకు ప్రిన్సిపాల్ పదోన్నతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియేట్ స్పాట్ కేంద్రం వద్ద లెక్చరర్లు, ఎఫ్‌ఏసి ప్రిన్సిపాళ్ళు ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ గణేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో 250 ప్రిన్సిపాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. వాటిని వెంటనే పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 29లోగా డిపిసి నిర్వహించకపోతే 30వ తేదీ నుండి స్పాట్‌ను బహిష్కరించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెంటనే చర్యలు తీసుకొని పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎఫ్‌ఎసిలుగా ఉన్న ప్రిన్సిపాళ్ళపై అదనపు పనిభారాన్ని తగ్గించాలన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్ళుగా బాధ్యతలు చేపడుతూ విద్యార్థులకు విద్యాబోధన చేపట్టాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రేపు మాపు అంటూ ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని, వెంటనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఐఈవో బి.నాగేందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో లెక్చరర్లు బాస భగవాండ్లు, కన్న మోహన్‌బాబు, సూర్యప్రకాష్, కనకయ్య, సుదర్శన్, శంకర్, శివ్‌రాజ్, జయ, సరితరాణి తదితరులు పాల్గొన్నారు.