అదిలాబాద్

2 నుంచి 4 వరకు పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మార్చి 27: జిల్లాలో ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వరకు రెండవ విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య తెలిపారు. సోమవారం స్తానిక కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పల్స్‌పోలియో సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నిశాఖల సమన్వయంతో వచ్చేనెల 2 నుండి 4వ తేదీ వరకు రెండవ విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 0-5 సంవత్సరాలలోపు 93041 మంది పిల్లలు జిల్లాలో ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరికి పోలియో చుక్కలను వేయించాలని ఆయన సూచించారు. చుక్కల మందు వేయడంలో ఐసిడిఎస్, విద్యాశాఖ కీలకపాత్ర పోషించాలన్నారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు రెవెన్యూశాఖ, చురుకైన పాత్ర పోషించాలన్నారు. పల్స్‌పోలియో ఇమ్యూనైజేషన్ బూత్‌లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఐసిడిఎస్, అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలను గుర్తించి పిల్లలను పల్స్‌పోలియో కేంద్రాలకు తీసుకువచ్చేలా కృషిచేయాలన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమం సందర్భంగా నిరంతరంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను, గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పల్స్‌పోలియోపై గ్రామసేవకులు గ్రామాల్లో దండోరావేసి ప్రచారం చేయాలని పేర్కొన్నారు. డివిజినల్ పంచాయతీ అధికారులు, గ్రామకార్యదర్శులు, ఇతర ఉద్యోగులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యానర్లు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆయా బూత్‌ల టీమ్ సభ్యులు వంద శాతం 0-5 పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేయించేలా ఏర్పాట్లుచేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జలపతినాయక్ మాట్లాడుతూ జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు 637 పిపిఐ బూత్‌లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 78, గ్రామీణ ప్రాంతాల్లో 559 బూత్‌లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.అలాగే 20 మొబైల్ టీమ్‌లు, 92మంది సూపర్‌వైజర్లు, 2548 పిపిఐ టీమ్ సభ్యులు, 92 వాహనాలను కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలోని 240 గ్రామపంచాయతీలు, 387 గ్రామాల్లో, 2 మున్సిపాలిటిల్లో, 106 హెల్త్ సబ్‌సెంటర్ల పరిధిలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగేష్, జిల్లా విద్యాధికారి ప్రణీత, డిపివో నారాయణ, మున్సిపల్ కమీషనర్ త్రయంబకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సంగీతమే ముక్తికి సోపానం
* అన్నమయ్య సంకీర్తనగోష్టిలో జెసి కృష్ణారెడ్డి

ఆదిలాబాద్, మార్చి 27: భక్తిమార్గం ద్వారా భగవంతునికి చేరువయ్యే సాధనం సంగీతమని, అన్నమయ్య సంకీర్తనలు తెలుగు భాష సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తాయని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ కె.కృష్ణారెడ్డి అన్నారు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఆదిలాబాద్‌లోని కైలాస్‌నగర్‌లో ప్రముఖ సంగీత విద్వాంసురాలు గాయత్రి ప్రసాద్ శిష్యబృందం అధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ముఖ్యఅతిథులుగా హాజరైన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కె.కృష్ణారెడ్డి, ఆయన సతీమణి జమున, డాక్టర్ రమా అశోక్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షురాలు ప్రముఖ వైద్యురాలు రమా తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి అన్నమయ్య జీవిత ప్రస్తానం, సంకీర్తనల గురించి వివరించారు. సంగీతానికి ఎల్లలు లేవని, సంగీతం ద్వారా మానసిక ప్రశాంతతో పాటు భక్తిమార్గం ద్వారా ముక్తిని సాధించవచ్చని అన్నారు. తెలుగుభాష సంస్కృతికి ఆధ్యుడైన వాగ్గేయకారుడు అన్నమయ్య కీర్తనలు ఇంటింటా వర్ధిల్లుతున్నాయని, ఆయన పదాల అమరిక, సాహిత్యం భావితరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమా మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించి స్వయంగా వెంకటేశ్వర స్వామి దైవాంశ సంబూతిడిగా వేనోళ్లకీర్తింపబడిన అన్నమయ్యను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. 30 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లాలో విశేషసేవలందించి కర్ణాటక సంగీతానికి గుర్తింపు తెచ్చిన గాయత్రిదేవి సేవలను ఆమె కొనియాడారు. గాయత్రిదేవికి వేలాదిమంది శిష్యులు రుణపడి ఉంటారని, సంగీత సాధనం ద్వారా ఎన్నో మైలురాళ్ళు అదిగమించారని రమా ప్రసుతించారు. జాయింట్ కలెక్టర్ సతీమణి కందుకూరి జమున మాట్లాడుతూ సాహిత్యం, క్రమశిక్షణ విలువలు పతనం అవుతున్న వేళ నేటితరం విద్యార్థినిలు, మహిళలు మానసిక ఒత్తిళ్ళ నుండి ఉపశమనం పొందేందుకు సంగీతం అభ్యసించడం హర్షించదగిన పరిణామమన్నారు. ఈ సందర్భంగా హేవళంబి నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 50 మంది సంగీత కళాకారులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు ప్రతి ఒక్కరి మనస్సును ఓళలాడించాయి. కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త ఓం ప్రకాష్ అగర్వాల్, విజయేంద్రనాథ్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.