అదిలాబాద్

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రధాన్యత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, మార్చి 27: ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కుమ్రంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న కలెక్టర్ చంపాలాల్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకిరించారు. అర్జీదారుల సమస్యలను ఓపికతో విన్న కలెక్టర్ పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్ సెల్‌లో అందే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులపై ఆయన శాఖల వారిగా ఆరా తీశారు. కాగా, ఈప్రజాఫిర్యాదుల విభాగంలో 170 ఫిర్యాదులు అందాయి. వీటిలో కెరమెరి మండలం నాగల్‌గొంది గ్రామానికి చెందిన గెడం గంగారాం అనే రైతు ఆక్రమణకు గురైన తన పట్ట్భామి తనకు ఇప్పించాలని కోరారు. రోడ్డు విస్తీర్ణంలో కల్వర్టు పనులు వెంటనే పూర్తి చేయాలంటూ చింతలమానెపల్లి మండలం డబ్బాగ్రామానికి చెందిన రాంటెంకి రమేష్ అర్జీ సమర్పించారు. వ్యవసాయ భూమిలో బోర్‌బావి మంజూరీ కోసం ఆసిఫాబాద్ మండలం అడదస్నాపూర్‌కు చెందిన లావుడ్య పామా అనే రైతు కలెక్టర్‌ను కోరారు. కెరమెరి, అనార్‌పల్లి, జైనూర్ మార్కెట్ యార్డులో కందులు విక్రయించిన రైతుల డబ్బులు వెంటనే ఇప్పించాలని ఆయా గ్రామాల రైతులు వినతిపత్రం అంద చేశారు. భర్త ఉద్యోగం కొడుక్కి ఇప్పించాలంటూ వాంకిడి మండలం వెలిగి గ్రామస్తురాలు జాడి పార్వతిబాయి అర్జీ పెట్టుకున్నారు. ప్రజాఫిర్యాదుల విభాగంలో జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీవో సురేష్, డిఆర్‌డిఓ శంకర్‌తోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కుమ్రం భీం జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కరించాలి
* సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుండా మల్లేష్
ఆసిఫాబాద్ రూరల్, మార్చి 27: కుమ్రం భీం జిల్లా రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుండా మల్లేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎందరో దళితులు బలహీన, గిరిజన కుటుంబాలు కలిగిన వారు ఉన్నారని వారందరికి సాగు భూములు ఇవ్వాలని అలాగే సాగు చేసుకుంటున్న రైతులకు వ్యవసాయ భూమిలో నీరు అందేలా చూడాలని అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూం, దళితులకు మూడెకరాలు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2వేలు అందించేలా చొరవ చూపాలన్నారు. అలాగే జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్‌లో గ్యారేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. మరియు సిర్పూర్ కౌటాల, రెబ్బెన, భీమిని, తాండూర్, మందమర్రి, కాసిపేట, మండలాలకు చెందిన రైతులకు వారి వ్యవసాయ భూములకు సాగు నీరు అందించేందుకు ఇరిగేషన్ వారు సర్వే నిర్వహించేలా చూడాలని వారిని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి, నాయకులు గణేష్, రాజగౌడ్, శ్రీమల తదితరులు పాల్గొన్నారు.