అదిలాబాద్

నర్సరీల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, మార్చి 27: ఆటవీశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా ఆటవీశాఖ ఆధికారిణీ ప్రవీణ అన్నారు. సోమవారం ముధోల్ మండలంలోని తరొడ గ్రామంలో ఆటవీశాఖ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన నర్సరీలను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆటవీశాఖ అధ్వర్యంలో 79.07 లక్షల మొక్కలను సిద్దం చేయడానికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. 23 లక్షల మొక్కలు జాతీయ గ్రామీణ ఉపాధిహమి పథకం ద్వారా అందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రతిష్టత్మకంగా ప్రారంభించిన హరితహరం పథకానికి అవసరమైన మొక్కులు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రస్తుతం ఎండలు పెరిగి పోవడంతో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మొక్కలకు సకాలంలో నీళ్లు అందించాలన్నారు. ఉద్యనవన శాఖ అధ్వర్యంలో 8లక్షల మొక్కలు పెంచవలసి ఉండగా నిధుల లేమితో మొక్కలను పెంచడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. వర్షాకాలంలో హరిత హరం పథకానికి అవసరమైన మొక్కలను సిద్దంగా ఉంచాలని సిబ్బందిని అదేశించారు. సిబ్బంది బాధ్యతయుతంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా డివిజన్ అటవీశాఖ ఆధికారులు, బీట్ ఆధికారులు, తదితరులు ఉన్నారు.

గేట్ పరీక్షలో ట్రిపుల్ ఐటి విద్యార్థుల ప్రతిభ
బాసర, మార్చి 27: బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటిలో విద్యనభ్యసించిన కళాశాల పూర్వ విద్యార్థులు 2017 గేట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభకనబర్చినట్లు కళాశాల వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ తెలిపారు. ఈసి ఈ ఇన్స్‌ట్యూమెంటేషన్ బ్రాంచిలో మెదక్ జిల్లాకు చెందిన రమేష్ 6వ ర్యాంక్, వికారాబాద్‌కు చెందిన పురుషోత్తం 43వ ర్యాంక్, కరీంనగర్ జిల్లా గుంటూరుపల్లికి చెందిన నవీన్ 2వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. వీరందరూ ట్రిపుల్ ఐటి యూనివర్సిటిలోని ఫైనల్ ఇయర్ పూర్తిచేసి గేట్‌లో ఉత్తమ ప్రతిభకనబర్చడం కళాశాలకు గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల పిఆర్‌వొ మధుసుదన్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మెరుగైన సేవలు అందించండి
* భైంసా ఆర్డీవో రాజు
భైంసా రూరల్, మార్చి 27: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలని భైంసా ఆర్డీవో ఇ.రాజు సూచించారు. సోమవారం మధ్యాహ్నం ఆర్డీవో కార్యాలయంలో భైంసా డివిజన్ పరిధిలోని వసతిగృహ సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూను తప్పకుండా అమలుచేయాలని, ప్రతీనెల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, కాస్మోటిక్ చార్జీలను సకాలంలో చెల్లించాలని సూచించారు. బియ్యంలో నాణ్యతపాటిస్తూ 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక ట్యూషన్లను అందిస్తూ వార్డెన్ పిల్లలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో ఎన్జీవో తాలుకా అధ్యక్షుడు రాజ్‌కుమార్, సంక్షేమ అధికారులు నాగారావు, శ్రీహరి, కుమార్, ప్రధానోపాధ్యాయులు బోజారాం తదితరులు పాల్గొన్నారు.