అదిలాబాద్

రైతుల దరిచేరని రాయితీ ట్రాక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 30: ఆధునిక సాగు ద్వారా రైతులను యాంత్రీకరణవైపు మళ్లీంచేందుకు ప్రభుత్వం సబ్సిడీతో మంజూరు చేస్తున్న ట్రాక్టర్లు, రోటోవేటర్లను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పైరవీలు ముమ్మరం చేశారు. గత ఏడాది సబ్సిడీపై అందించిన రాయితీలను రైతుల దరిచేరనివ్వకుండా ఆయా మండలాల్లో బినామీపేర్లపై అధికార పార్టీ నేతలు దొడ్డదారిన మంజూరు చేసుకొని లబ్దిపొందగా ఈసారి కూడా అదే రీతిలో వ్యవసాయ శాఖలో పైరవీలు జోరందుకున్నాయి. 201617 సంవత్సరానికి గాను సబ్సిడీ ట్రాక్టర్లు, రోటోవేటర్ల కోసం అర్హులైన రైతుల నుండి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాలకు చెందిన రైతులకు సంబంధించి దరఖాస్తులను మండల స్థాయి కమిటీ ఎంపిక చేసి వ్యవసాయ శాఖకు నివేదించగా ఆతర్వాత జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు ఆమోదముద్రవేసి ట్రాక్టర్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ 108 మంది రైతుల కోసం 4కోట్ల 40లక్షల కేటాయించాల్సి ఉండగా వ్యవసాయ శాఖలో కోటి నిధులు మాత్రమే ఈ పథకానికి మంజూరై ఉన్నాయి. అయితే మంత్రి జోగురామన్న రైతుల సంఖ్య 50 మంది వరకు ఇచ్చేలా అధికారులను ఆదేశించారు. అయితే ఈ సబ్సిడీ ట్రాక్టర్లను పొందేందుకు 50శాతం డబ్బులను ముందస్తుగానే బ్యాంకుల్లో డీడీల రూపేన చెల్లించాలని ఆదేశాలు రావడం రైతులకు ఆశనిపాతంగా మారింది. పైగా క్షేత్రస్థాయిలో రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు, రోటోవేటర్లు అందిస్తున్న విషయం ఇంత వరకు తెలియకుండా వ్యవసాయ శాఖ కూడా గోప్యంగా ఉంచడంపై కూడా విమర్శలకుతావిస్తోంది. ప్రజా ప్రతినిధులు తమమాట చెల్లుబాటు చేసుకొని కార్యకర్తలకు లబ్దిచేకూర్చేందుకే ఈ పథకాన్ని వర్తింపజేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండునెలల క్రితమే రైతులకు తెలియజేస్తే అప్పు సొప్పు చేసి 50 శాతం డబ్బులను సమకూర్చే అవకాశం ఉండేది. మార్చి 31 చివరి వరకు మాత్రమే డీడీలు తీయడానికి అవకాశం కల్పించగా గత మూడు రోజులుగా టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఉమ్మడి జిల్లాల్లో సబ్సిడీ యంత్రాలను పొందేందుకు పైరవీలు ముమ్మరం చేశారు. కోటా తక్కువగా ఉండగా నేతల మద్య పోటీ పెరగడంతో పైరవీలు జోరందుకున్నాయి. రైతులు దరఖాస్తు చేసుకున్నా 31లోపు డీడీలు చెల్లించకపోతే సబ్సిడీ ట్రాక్టర్లు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, నిర్మల్ జిల్లాలో జిల్లా కమిటీల ఎంపికలతో ప్రమేయం లేకుండానే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన వర్గీయులకు ట్రాక్టర్లు, రోటోవేటర్లు కట్టబెట్టేందుకు జాబితాను సిద్దం చేసుకొని 70 మందికి సిపార్సు చేసినట్లు తెలిసింది. అంతేగాక వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆమోదముద్ర వేసుకొని రాష్ట్ర రిజర్వుకోటా పేరిట కేవలం నిర్మల్ డివిజన్‌కు మాత్రమే 70 మందికి సబ్సిడీ ట్రాక్టర్లను మంజూరు చేసుకోవడం చర్చనియాంశంగా మారింది. భైంసా, ఖానాపూర్ డివిజన్లను విస్మరించడంపై ఆ ప్రాంత రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో 55 మంది రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు మంజూరవుతుండగా వీటిలో 30 మంది మాత్రం బ్యాంకుల్లో సబ్సిడీ డిపాసిట్ చేశారు. స్థానిక శాసన సభ్యురాలు, ఎమ్మెల్సీ పైరవీలతో కార్యకర్తలు తమకు ట్రాక్టర్లు దక్కించుకునేలా దొడ్డదారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంచిర్యాల జిల్లాలో 31 యూనిట్లను మంజూరు చేయగా కార్యకర్తల మద్య పోటీ అధికంగా ఉంది. అర్హులైన రైతులను విస్మరించి జిల్లా కమిటీల ఎంపికను తుంగలో తొక్కి అధికార పార్టీ నేతలు రైతుల యంత్రాలను అనర్హులకు అందించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్లు ఈవ్యవహారంపై సీరియస్‌గా దృష్టిసారించి, అర్హత ఉన్న రైతులకు సబ్సిడీ యంత్రాలు దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.