అదిలాబాద్

సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెలో పాల్గొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మార్చి 30: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేంది లేదని లారీ ఓనర్స్ హెల్పర్స్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షులు అబ్దుల్ రసీద్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం పిలుపు మేరకు చేపట్టిన సమ్మెలో మంచిర్యాల లారీ యజమానులు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లారీ యజమానులకు పెంచనున్న థర్డ్ పార్టీ ఇన్స్‌రెన్స్‌ను తగ్గించాలని, చాలానా ఫీజులు, టోల్ టాక్స్‌లు, ఇతర ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేసారు. ప్రపంచ స్థాయి డాలర్ రేట్ ప్రకారం డిజిల్ ధరలు అమలు చేయాలని, 15 సంవత్సరాల వాహనాలను రద్దు చేయదలచిన విధానంను విరమించుకోవాలని యాక్సిండెంట్, ఓవర్ లోడ్ కేసులలో డ్రైవర్ లైసెన్స్‌లు రద్దు విధానంను విరమించుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానంను అమలు చేసేందుకు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. జూన్ 2015 లో జరిగిన లారీ ల బంధ్ సందర్బంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాత పూర్వకంగా చేసుకున్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. లారీలపై అధిక ఓవర్ లోడ్ నివారించాలని ఓ వర్ లోడ్‌ను ప్రోత్సాహించిన లారీ వినియోగ దారునిపై మోటర్ వాహన చట్టం 119 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లారీ యజమానుల నుండి లోడింగ్, అన్‌లోడింగ్ వద్ద మామూలు వసూల్ చేసే విధానం రద్దు చేయు ఆర్డినెన్స్‌ను రెండు ప్రభుత్వాలు కలిసి అమలు చేయాలని తెలిపారు. రహదారులపై యజమానులు ఎదుర్కోను సమస్యలపై చర్చించి వాటిని నివారించాలన్నారు. ఇసుల లారీ యజమానుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని అక్రమ ఇసుక రవాణా లోడింగ్‌లను ఎక్కువ లోడ్ చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. చట్ట వ్యతిరేక ఇసుక రవాణా ఓవర్ లోడ్, కంకర రవాణాను అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. లారీ యజమానుల సమ్మెకు ఇతర వాహన యజమానులు కూడా సహాకరించి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖాజా రఫీ ఉద్దీన్, కోల్‌బెల్ట్ లారీ ఓనర్స్ హెల్పర్స్ అసోసియేషన్ మందమర్రి అధ్యక్షులు కోటి లింగం, ప్రధాన కార్యదర్శి రామదేని రమేష్, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ లైన్లు ఏర్పాటు కోసం చెట్లు నరికివేత..?
* ఇళ్లపై నుంచి 11 కెవి లైన్‌లు వేయరాదని నాయకుల డిమాండ్
మంచిర్యాల, మార్చి 30: హాజీపూర్ మండలంలోని నర్సింగపూర్ గ్రామంలోని రాజేశ్వర్ రావు పల్లేలో ఏర్పాటు చేసిన రైలు మిల్లుకు విద్యుత్ సౌకర్యం కల్పించుటకు చెట్లను నరికివేయడం ఏమిటని కిసాన్ రైతు మిత్ర సంఘం నాయకులు ప్రశ్నించారు. గురువారం నరికివేస్తున్న చెట్లను అడ్డుకున్నారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు బొలిశెట్టి తిరుపతి, బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి చెట్లు నాటుతుంటే రైస్‌మిల్లుకు విద్యుత్ లైన్ అమర్చుటకు చెట్లు నరుకుతూ ప్రజధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క పక్క పచ్చని చెట్లు పెంచి వాతవరణం సమతుల్యతలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వ చేపడుతున్న హరితహార కార్యక్రమంకు విరుద్దంగా చెట్లు నరికివేస్తున్న ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు విద్యుత్ లైన్ వేయడానికి సహాకరిస్తున్నారన్నారు. ఇప్పటికే 11 కేవి విద్యుత్ లైన్ వేస్తున్నారని గతంలో వేసిన విద్యుత్ లైన్ రైతు ఇంటి పై నుంచి వెళ్లిందని చెట్ల పై నుంచి వెళ్లే విద్యుత్ లైన్లకోసం చెట్లను నరికివేస్తున్నారని ఇంటి పై నుంచి వెళ్లిన విద్యుత్ లైన్‌లను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. చెట్లను నరికివేస్తున్న వారిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రైతు మిత్ర సంఘం నాయకులు గంగారెడ్డి, లక్ష్మణ్ గౌడ్, స్వామి, నందయ్య, శ్రీనివాస్, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.