అదిలాబాద్

నేడే పాలిసెట్ ప్రవేశపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 20: నేడు నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సంజయ్‌గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.సత్యనందం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే పాలిసెట్ ప్రవేశపరీక్ష కోసం జిల్లా కేంద్రంలో 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలుర, బాలికల జూనియర్ కళాశాల, టిటిడబ్ల్యూ ఆర్‌జెసి బాలుర, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కొలాం ఆశ్రమ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులందరికి హాల్‌టికెట్లు జారీ చేయడం జరిగిందని, హాల్‌టికెట్లు అందని అభ్యర్థులు వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడు చేసుకోవాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంటముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

అధికారులు ప్రజలతో సమైక్యతగా ఉండాలి
* డిఆర్‌వో వీర బ్రహ్మయ్య
మంచిర్యాల, ఏప్రిల్ 21: భూ సమస్యలపై అధికారులు ప్రజలతో ఎంతో సమైక్యతగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి వీర బ్రహ్మయ్య అన్నారు. శుక్రవారం పౌర సేవల దినోత్సవం సందర్బంగా కలెక్టర్ సమావేశ మందిరంలో న్యాయ వాదులకు, రెవెన్యూ అధికారులతో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే ప్రతి రోజు దిన చర్యగా యోగా, ధ్యానం చేయాలని తెలిపారు. భూ సంబంధిత సమస్యలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రెవెన్యూ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఇంచార్జ్ ఆర్డీ ఓ శ్యామల దేవి, బెల్లంపల్లి ఆర్డీ ఓ వీరన్న, సిపి ఓ సత్యనారాయణ రెడ్డి, జిల్లా లోని రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థులకు ఎంసెట్‌లో ఉచిత శిక్షణ
* ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్
ఉట్నూరు, ఏప్రిల్ 21: ఏజెన్సీలోని అర్హులైన గిరిజన యువతి యువకులకు ఎంసెట్‌లో ఉచిత కోచింగ్ ఇస్తామని ఐటిడి ఏ ఇంచార్జి ప్రాజెక్టు అధికారి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. శుక్రవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉట్నూరు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎంసెట్ కేంద్రాల్లో నిపుణులతో కోచింగ్ నిర్వహిస్తామని, దానికి తగ్గ ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ యొక్క అవకాశాన్ని ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలకు పప్పు ధాన్యాలను నాణ్యతతో కూడినవిగా ఎంపిక చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వాంకిడి, తిర్యాణిలలో పప్పు ధాన్యాల మిల్లులు ఉన్నాయని, అక్కడ ఎంపిక చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో ఖాళీ పోస్టులను భర్తీచేసేందుకు షెడ్యుల్ విడుదల చేసినందునా అర్హత గల గిరిజన యువతీ యువకులను ఎంపిక చేసి వారికి ఉచిత సౌకర్యాలతో కూడిన కోచింగ్ ఇవ్వాలని బి ఈడి కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాలను బ్యాంకుల సహకారంతో అర్హులైన లబ్దిదారులకు అందించేందుకు నిర్దిష్ట లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీ గ్రామాల్లో మంచినీటి ఎద్దడిని లేకుండా చూడాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమన్వయంతో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. అనంతరం పలు శాఖల అధికారులతో పలు కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి కుమ్ర నాగోరావు, ఏజెన్సీ వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, డిఎంవో అల్హాం రవి, విజయ్‌కుమార్, అధికారులు సనత్‌కుమార్ శాస్ర్తీ, పెందూర్ భీం తదితరులు పాల్గొన్నారు.