అదిలాబాద్

కదిలింది.. గులాబి దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 27: వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుండి సుమారు 40వేల మంది గులాబి శ్రేణులు తరలివెళ్ళాయి. గురువారం ఉదయం నుండే పల్లెలు, పట్టణాల్లో కార్యకర్తల కొలాహలం, నేతల సందడి కనిపించింది. బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుండి వేలాది మంది పార్టీ శ్రేణులు గులాబి కండువాలు కప్పుకొని జై తెలంగాణ నినాదాలతో ర్యాలీగా బయల్దేరారు. ఆదిలాబాద్, నిర్మల్ నియోజకవర్గాల్లో మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి బల ప్రదర్శన కోసం పోటీపడి కార్యకర్తలను సమీకరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి 85 ఆర్టీసి బస్సులు, 15 ప్రైవేట్ బస్సుల్లో కార్యకర్తలు రాంలీలా మైదానం నుండి తరలివెళ్ళగా మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా జెండా ఊపి కార్యకర్తల ర్యాలీని ప్రారంభించారు. ఇదిలా ఉంటే ప్రైవేట్ వాహనాల్లో వందలాది మంది కార్యకర్తలు గులాబి జెండాలతో ఓరుగల్లు సభకు బయల్దేరగా ఈసారి మహిళలు కూడా ప్రత్యేకంగా బస్సుల్లో వెళ్ళడం కనిపించింది. మంత్రి జోగురామన్న సొంత మండలమైన జైనథ్ మండలం నుండి సుమారు 3వేల మంది తరలివెళ్ళగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి మొత్తం 7వేలకు పైనే తరలివెళ్ళినట్లు అంచనా. అదే విధంగా బోథ్ నియోజకవర్గం నుండి ఎంపి గెడం నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పోటీ పడి కార్యకర్తల జనసమీకరణతో బలప్రదర్శనకు చేపట్టారు. ఎవరికివారు బస్సులను సమకూర్చి కార్యకర్తలకు తరలించేందుకు పోటీ పడ్డారు. అయితే 44 డిగ్రీల ఎండలను లెక్కచేయకుండా కార్యకర్తలు సమరోత్సాహంతో తరలివెళ్ళడం గమనార్హం. వరంగల్ బహిరంగ సభ రైతుల సంక్షేమమే ఎజెండాగా నిర్దేశించిన నేపథ్యంలో ఈసారి గ్రామీణ ప్రాంత రైతులను భారీగా తరలించడం కినిపించింది. ఉట్నూరు, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాల నుండి ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, రేఖాశ్యాంనాయక్‌లు ఆర్టీసి, ప్రైవేట్ బస్సుల్లో కార్యకర్తలను బహిరంగ సభకు తరలించగా, వారికి మార్గమద్యంలోనే భోజన ఏర్పాట్లుగావించారు. వరంగల్ బహిరంగ సభకు వెళ్ళిన జనం మాత్రం బహిరంగ సభతో పాటు ఆ జిల్లాలోని పుణ్య క్షేత్రాలు కూడా దర్శించేందుకు తమకు వీలు కల్గిందని, ఇది అందివచ్చిన అవకాశంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా నుండి తరలివెళ్ళిన కార్యకర్తలకు మార్గమద్యంలోని కరీనగర్ జిల్లా హోటళ్ళు, ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లలో భోజన ఏర్పాట్లను గావించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి వెళ్ళిన సుమారు వెయ్యికిపైగా కార్యకర్తలకు భోజనం దొరకకా అనేక అవస్థలు పడ్డారు. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం సమీకరణ కోసం వారం రోజులుగా చేసిన కసరత్తులు ఫలించాయి. ఇక తూర్పు జిల్లా నుండి మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రం ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ముందస్తుగా రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకొని కార్యకర్తలను తరలించారు. కాగజ్‌నగర్‌లో అక్కడి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంటి వద్దే భోజన ఏర్పాట్లు గావించి సుమారు 2వేల మంది కార్యకర్తలను రైళ్ళద్వారా ఓరుగల్లు సభకు పంపించారు. జమిలి ఎన్నికలు ముందస్తుగానే ఉంటాయన్న ప్రచారం నేపథ్యంలో శాసన సభ్యులకు ఓరుగల్లు బహిరంగ సభ ప్రతిష్టాత్మకంగా మారగా జన సమీకరణ కూడా పోటీపడి చేయడం ద్వారా పార్టీలో నూతనోత్తేజం వెల్లివిరిసింది.