అదిలాబాద్

ఆలయ పాలకవర్గం నియామకంపై ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఏప్రిల్ 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికి రాష్ట్రంలోని కార్పోరేషన్ పదవులతోపాటు ఆలయ పాలకవర్గాల నియామకం సందిగ్ధత నెలకొంది. గత రెండు సంవత్సరాలుగా వివిధ కార్పోరేషన్ పదవులతోపాటు ఆలయ పాలకవర్గాలను ప్రభుత్వం నియమించేందుకు కసరత్తుచేస్తున్నప్పటికి వివిధ కారణాల రీత్యా అంతరాయం కలుగుతుంది. నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉగాది పండగ అనంతరం కార్పోరేషన్ పదవులతోపాటు ఆలయ పాలకవర్గాలను సైతం నియమించనున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో తెరాసా ద్వితీయ శ్రేణి నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మార్కెట్ కమిటి పదవులతోపాటు గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్, ఆలయ పాలకవర్గాలను సైతం నియమించే అవకాశం ఉంది. జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న బాసర ఆలయ పాలకవర్గం నియామకంపై తెరాసా ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో రాష్ట్ర దేవాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బాసర ఆలయ అభివృద్ది కమిటి పేరుతో మూడు నెలల కాలానికి కమిటిని నియమించారు. పుష్కరాల సందర్భంగా సైతం ఆ కమిటిని ఆలయ వ్యవహారాలను చేపట్టింది. బాసర ఆలయ పాలకవర్గం నియామకంపై స్థానిక తెరాసా నేతలు ఆశలుపెట్టుకున్నారు. బాసరగ్రామంలో కాంగ్రెస్, తెదెపాలకు చెందిన జిల్లా నాయకులు తెరాసాలో తీర్థం పుచ్చుకోవడంతో బాసరలో బిజెపికి చెందిన వ్యక్తి స్తానిక సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో పలువురు తెరాసా నాయకులు ఆలయ పాలకవర్గం నియామకంలో తమకు చోటుకు దక్కుతుందనే విశ్వాసంతో స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న చుట్టూ ప్రదక్షిణలుచేస్తున్నారు. బాసరకు చెందిన ఇద్దరికే ఆలయ పాలకవర్గంలో చోటుదక్కే అవకాశం ఉందని స్తానికులు అభిప్రాయపడుతున్నారు. పాలకవర్గం నియామకమైతే ఆలయ అభివృద్దికి ప్రణాళికలు వేసే అవకాశం ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆలయ పాలకవర్గ నియామకంలో ధార్మిక సేవా సంస్థ సభ్యులకే అవకాశాలు కల్పించాలని వివిధ వర్గాల ప్రజలు కోరుతున్నారు.