అదిలాబాద్

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాసమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఏప్రిల్ 27: ప్రజా సమస్యల పరిష్కారంకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కుమ్రంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. గురువారం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జిల్లాలోని విఆర్‌ఓలకు ట్యాబ్‌లను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ట్యాబ్‌లు ఎంతగానో ఉపయోగ పడతాయని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇంటర్నెట్ సహాయంతో ఉన్నతాధికారులకు క్షణాల్లో చేరవేసి పరిష్కారానికి కృషి చేయాలని విఆర్‌ఓలకు కలెక్టర్ చంపాలాల్ సూచించారు. ముఖ్యంగా రైతుల భూములు, పంటసాగు వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచ వచ్చన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు రికార్డు చేసుకోవడంతోపాటు, పంట నష్టం, కరువుపరిస్థితులను ప్రభుత్వానికి ఇంటర్నెట్ సహాయంతో నివేదించి, వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని విఆర్‌ఓలకు ఆయన సూచించారు. గ్రామానికి మొట్టమొదటి అధికారి వి ఆర్ ఓ అయినందున తప్పుడు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మారితేనే ప్రగతి సాధ్యపడుతుందన్నారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా విధులు నిర్వర్తించాలని చంపాలాల్ సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ కదం సురేష్, సాంకేతిక నిపుణుడు రవికాంత్ దెశ పాల్గొన్నారు.