అదిలాబాద్

ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 27: టిఆర్‌ఎస్ వరంగల్‌లో తలపెట్టిన 16వ వార్షికోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులులేక పోవడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురవతూ గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దూర ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, బాసర, కరీంనగర్ ప్రయాణికులు ఉదయం నుంచి నానా ఇబ్బందులు ఇక్కట్లు పడుతూ బస్టాండ్‌లోనే బస్సుల కోసం పడిగాపులు కాస్తు ఓపిక నశించి వందల రూపాయలు ఖర్చు చేస్తు ప్రాణాలు గుపెట్లో పెట్టుకోని ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసి అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా, ప్రయాణికులు బస్సుల సమయ సారణి అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంచిర్యాల బస్టాండ్‌లో కాసేపు ప్రయాణికులకు, ఆర్టీసీ అధికారులకు వాగ్వాదం చోటు చేసుంకుంది. దీనితో ప్రయాణికులు చేసేది ఏమి లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి దూ ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అదనపు డబ్బులు చెల్లించి, గమ్య స్థానాలను చేరుకున్నారు. ప్రభుత్వం చేసే పనులకు మేమేలా బాధ్యులం అవుతామని అవేధన వ్యక్తం చేసారు. పార్టీలు చేసే బహిరంగ సభలకు, ప్లీనరీలకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీని ఉపయోగించుకోని సామన్య ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా వీరు చేసేది ఏమిలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాబోవు రోజులలో ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరారు. మంచిర్యాల డిపో వందలాది బస్సులు ఉన్నప్పటికీ అందులో కొన్ని బస్సులు పని చేయకపోవడంతో మంచిర్యాల బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు లేకపోవడంతో అధికారులను ఆశ్రయించిన అధికారులు కూడా డ్యూటీలో ఉండకుండా ముఖం చాటేస్తు తప్పించుకుంటున్నారన్నారు. కేవలం మంచిర్యాల డిపో నుంచి 70బస్సులను వరంగల్‌లో జరిగే సభకు కేటాయించడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో జరిగే పోలీస్ కానిస్టేబుల్స్ రిపోర్టు చేయాల్సి ఉండగా సుదూర ప్రాంతమైన ఆదిలాబాద్ చేరుకోవాలంటే ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడానికి వెళ్తే వారికి అక్కడ కూడా ప్రైవేట్ వాహనాల యజమానులు అధిక ధరలు వసూల్ చేసేందుకు సిద్దం అయ్యారని దీనితో ఏమి చేయాలో పాలుపోవడం లేదని అభ్యర్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.