అదిలాబాద్

రైతు సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, ఏప్రిల్ 27: రైతు సంక్షేమమే కెసిఆర్ ధ్యేయంగా పని చేస్తున్నాడని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పేర్కొన్నారు. గురువారం తన ఇంటి వద్ద తెలంగాణ శ్రేణులు వరంగల్ బహిరంగ సభకు తరలివెళ్తున్న సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోని పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అని రైతుల సంక్షేమాన్ని విస్మరించడం జరిగిందని ఆయన తెలిపారు. వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో కెసిఆర్ రైతుల మరియు ప్రజలకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలు పలు తీర్మాణాలు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు. బహిరంగ సభకు మందమర్రి నుంచి 150 ట్రాక్టర్, 80 కార్లు, 50 వాహనాల ద్వారా కార్మికులు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున్న బహిరంగ సభకు తరలివెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు జె రవీందర్, బత్తుల శ్రీనివాస్, ఎస్ ప్రభాకర్; సూరిబాబు, తిరుపతి రెడ్డి, శ్రావన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి
* డిఎంహెచ్‌ఓ సుబ్బారాయుడు
ఆసిఫాబాద్ రూరల్, ఏప్రిల్ 27: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని డిఎంహెచ్‌ఓ సుబ్బారాయుడు అన్నారు. డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో గురువారం వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు సురక్షితమనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. ఇందుకోసం గర్భిణీల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలను గుర్తించి పౌష్టికాహారాన్ని అందించేలా చూడాలని డిఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. ఇండ్లలో, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 4236 మంది, ప్రైవేటు ఆసుపత్రుల్లో 2948 మంది, ఇండ్లలో 774 ప్రసవాలు జరిగాయని డిఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. అయితే మున్ముందు వంద శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. జూన్ మాసం నుండి రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారం రోజుల్లోగా గర్భిణీల వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో డిఐఓ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ సుభ్రహ్మణ్యం, డిపిహెచ్‌ఎం విజయలక్ష్మి, స్ట్ఫా నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించాలి
* పంజాబ్ చౌక్‌లో మొక్కుబడి పనులపై కలెక్టర్ అసహనం

ఆదిలాబాద్, ఏప్రిల్ 27: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను సత్వరమే క్రమబద్దీకరించాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి మున్సిపల్, ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌరస్తా జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి పనుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ రహదారిపై పనులు నత్తనడకన సాగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే వర్షాకాలంలో పట్టణ ప్రజలు మురికి నీటితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, రోగాలు కూడా ముసురుకునే ప్రమాదం ఉందన్నారు. అనంతరం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వంతెన నిర్మాణానికి సంబంధించి నివేదికలను పరిశీలించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలకు మురికి నీరు ప్రవహించి అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ కూడా అస్థవ్యస్థంగా ఉందన్నారు. పట్టణంలో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెనలను సత్వరమే పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. పంజాబ్‌చౌక్ నుండి వ్యవసాయ మార్కెట్‌కు వెళ్ళే రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. డ్రైనేజి నీరు బయటకు రాకుండా పైపులైన్లు పగలకుండా ముందస్తుగానే పైపులైన్ వ్యవస్థను క్రమబద్ధీకరించుకోవాలని, శాశ్వత మురికి కాలువలు నిర్మించాలని ఆర్‌అండ్‌బి ఈఈ వెంకట్‌రెడ్డిని ఆదేశించారు. ఈసమావేశంలో మున్సిపల్ కమిషనర్ మంగతయారు, ఆర్‌అండ్‌బి ఈఈ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ ఈఈ కొండల్‌రావు, సురేష్, మార్కెట్ కార్యదర్శి అడెల్లు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
* ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించండి
* అవసరమైనచోట సూచికబోర్డులు, స్పీడ్‌బ్రేకర్లను ఏర్పాటుచేయాలి
* జిల్లా కలెక్టర్ ఇలంబరిది
నిర్మల్, ఏప్రిల్ 27: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు సెఫ్టీ కమిటి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది సూచించారు. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట సూచికబోర్డులు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటుచేయాలన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతోపాటు రోడ్డు సెఫ్టీ కమిటి సభ్యులతో రోడ్డు ప్రమాదాల నివారణపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను సెఫ్టీ కమిటి సభ్యులతోపాటు మెడికల్ సిబ్బంది సందర్శించి అవసరమైన వైద్య చికిత్సలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల పట్ల పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రధానరోడ్లపై మూల మలుపుల వద్ద, రోడ్లపై మరమ్మత్తు పనులు జరిగిన ప్రాంతాల్లో వాహన చోదకులకు కనిపించేలా తప్పనిసరిగా ప్రమాద సూచికబోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. ప్రమాదాలు జరిగే మూలమలుపుల వద్ద ఉన్న గ్రామాల ప్రజలతో రోడ్డు సెఫ్టీ కమిటి సభ్యులు, తహసిల్దార్‌తో కలిసి గ్రామస్తులకు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో రోడ్లను ఆక్రమించి ఎవరైనా దుకాణాలు నడిపితే ముందుగా నోటీసులు ఇచ్చి షాపులను తొలగించాలని పోలీసుశాఖను ఆదేశించారు. అలాగే చిన్న పిల్లలు వాహనాలు నడిపితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తల్లితండ్రులపై, వారి బంధువులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా ఖచ్చితంగా కేసులు నమోదుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, ఎంవి ఐ అజయ్‌కుమార్‌రెడ్డి, ఎ ఎంవి ఐ రాంచందర్, రాజమహేష్, డి ఎం అండ్ హెచ్‌వో జలపతినాయక్, డి ఆర్‌డివో వెంకటేశ్వర్లు, ఎ ఈలు, డి ఈలు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ ప్రసక్తే లేదు
* ప్రతేక ప్రజావాణిలో జిల్లా సంయుక్త కలెక్టర్ అశోక్ కుమార్
కౌటాల, ఏప్రిల్ 27: ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది పూర్తిగా పేద ప్రజల సమస్యలను ఇబ్బందులను తొలగించేందుకేనని ప్రజా సమస్యల పరిష్కారంలో ఎట్టి పరిస్థితులలోను రాజీ పడే ప్రసక్తే లేదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సంయుక్త పాలన అధికారి అశోక్ కుమార్ అన్నారు. మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు సంబంధించిన సమస్యలు వారికి అందుబాటులో ఉండి ఎక్కడిక్కడ పరిష్కరించాలని సంకల్పంతో ప్రత్యేక ప్రజా వాణి ఫిర్యాదుల విభాగాన్ని తొలిసారిగా కౌటాల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి వచ్చిన వివిధ గ్రామాల ఆర్జి దారులతో ఆయన సామరస్యంగా మాట్లాడి వారికి తగు రీతిలో సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసారు. మేము ఉన్నది మీకోసమేనని మీరు జిల్లా కేంద్రానికి రావడానికి పడే ఇబ్బందిని దూరం చేసేందుకే మండల కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఉన్నతాధికారులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న సంయుక్త పాలన అధికారి అశోక్‌కుమార్, మరోసారి తన పని తీరుతో ఆకట్టుకున్నారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న మొగడ్‌దగడ్ గ్రామానికి చెందిన చౌదరి సాయ కళ్యాణ లక్ష్మి, కేసు పెండింగ్‌లో ఉండగా, కౌటాల, చింతలమానేపల్లి తహశీల్దార్‌ల మధ్య కొన్ని కారణాలతో 2016 ఏప్రిల్ 29 పెళ్లి జరిగిన ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రోత్సహాకం అందని విషయంపై మొగడ్‌దగడ్ గ్రామానికి చెందిన వాన్ పటేల్, సలీంలు పేర్కొనగా అప్పటికప్పుడు ఇద్దరు తహసీల్దార్‌లతో మాట్లాడి కంప్యూటర్‌లో డబ్బుల కోసం రికమండ్ చేసారు. అదేవిధంగా పాత కనె్నపల్లి గ్రామస్తులు తమకు నీటి ఇబ్బందులు ఉన్నాయని ఒకటే బోర్ ఉండగా కనీసం ఒక మంచినీటి ట్యాంకు కూడా లేదని తమ కష్టాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడాలని కోరగా అప్పటికప్పుడు ఎంపి డి ఓ రాజేశ్వర్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ స్నిగ్ధాలను ఈ విషయంపై సమగ్ర నివేధిక కోసం పాత కనె్నపల్లి గ్రామానికి పంపించారు. అదేవిధంగా తుమ్మిడి హెట్టి గ్రామానికి చెందిన రాందాస్ అనే వ్యక్తి తనకు సంబంధించిన భూమిలో పరిహారం అందించకుండానే ప్రాణహిత కాల్వ పనులు త్రవ్వకాలు జరుపుతున్నట్లు ఫిర్యాదు చేయగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోని ఈ విషయంపై అక్కడే ఉన్న ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేష్ రాథోడ్‌తో మాట్లాడి శుక్రవారం రోజు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ను పంపించి రైతులు ఒప్పుకుంటే పరిహారం కోసం అన్ని విధాల సిద్దం చేయాలని అదేశించారు. దీనితో పాటే ముత్యంపేట గ్రామానికి చెందిన వారు నూతనంగా క్రషర్ ఏర్పాటుతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని దృష్టికి తీసుకురాగా ఇది కుదరదని అభివృద్ది కోసం అన్ని విధాల నిబంధనల ప్రకారం పని చేయాల్సి ఉంటుందని వారికి సమాధానం ఇచ్చారు. ఏదైనా అభ్యంతరం ఉంటే కాలుష్య నియంత్రణ మండలిని సంప్రదించాలని సూచించారు. దీంతోపాటే తాటిపల్లి గ్రామానికి చెందిన వారు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని పేర్కొనగా రవీంద్ర నగర్ గ్రామ సర్పంచ్ విష్ణు కవి రాజు తమ గ్రామ పరిధిలోని వారసంత స్థలంలో ఆక్రమాణాల విషయంపై జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో నుంచి ఎస్సి కార్పోరేషన్ రుణాల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నట్లు పలువురు లబ్దిదారులు జెసికి మొరపెట్టుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు తమ ఆదేశాలు ఇవ్వడమే కాక ఆయన మాట్లాడుతూ న్యాయంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్నివిధాల తమవంతు సాయం చేస్తామని అనవసరంగా లేనిపోని ఇబ్బందులు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటీవల పట్టదారు పాసు పుస్తకాలు టైటిళ్ల విషయంపై ఒకక స్పష్టత ఇచ్చామని ఆధార్ కార్డు నెంబర్ ద్వారా మీ సేవ కేంద్రాల ద్వారా ధృవ పత్రాలు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఆర్డీవో రమేష్ బాబు, కౌటాల, చింతలమానేపల్లి తహశీల్దార్ పరిమళ్ భౌమిక్, యాకన్న, ఎడీవో రాజేశ్వర్, ఎవో రాజేష్, ఐటిడిఏ సూపర్‌వైజర్ జయ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటర్ సిటి గులాబీ మయం
* కాగజ్‌నగర్ నుంచి భారీగా తరలిన గులాబీ శ్రేణులు
కౌటాల, ఏప్రిల్ 27: వరంగల్‌లో గురువారం నిర్వహించిన తెరాస ఆవిర్భావ బహిరంగ సభలో పాల్గొనేందుకు సిర్పూర్ నియోజక వర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నేతృత్వంలో గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లాయి. నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో గ్రామ గ్రామం నుంచి ప్రత్యేక వాహనాలల గులాబీ దండు ప్రత్యేక వాహనాలతో పాటు కాగజ్‌నగర్ నుంచి ఇంటర్ సిటి రైలులో భారీ ప్రయాణం అయ్యారు. వివిధ గ్రామాల నుంచి కాగజ్‌నగర్‌కు చేరుకున్న నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఇంటి వద్ద భోజన వసతి కల్పించారు. అక్కడ నుంచి ర్యాలీగా రైల్వేస్టేషన్‌కు చేరుకోని వేలాది సంఖ్యలో వారు బహిరంగ సభ కోసం తరలివెళ్లారు. జైతెలంగాణ, జై కెసిఆర్, జై కోనప్ప నినాధాలతో పట్టణ వీధులు మారుమోగాయి. అన్ని మండలాల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిదులతో పాటు పట్టణంలోని మార్కెట్ కమిటి చైర్ పర్సన్ నర్సింగోజు పద్మ సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ విద్యావతితో పాటు ముఖ్య నాయకులు కోనేరు కృష్ణ, కట్ట ప్రసాద్, వాసు దేవ్, జాకీర్ షరీఫ్, గిరీష్, చదువుల శ్రీనివాస్, నాజీం, వెంకయ్య, నానయ్య, తదితరులు ఉన్నారు.