అదిలాబాద్

పోలీస్ పహార మధ్య మున్సిపల్ ప్రత్యేక సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, ఏప్రిల్ 29: బెల్లంపల్లి మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక సమావేశం పోలీస్ పహార మధ్య జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ అధ్యక్షతన జరుగగా సమావేశంలో కమీషనర్ మల్లారెడ్డి, వైస్ చైర్మన్ నూనెటి సత్యనారాయణ, ఏ ఈ లు దయాకర్, సందీప్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్‌లు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే మొదటగా 31వ వార్డు కౌన్సిలర్ ఎలిగేటి శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డులో నాన్‌ప్లాంట్ గ్రాంట్ రూ. లక్షతో ప్రతిపాదించిన రోడ్డు ఎందుకు చేపట్టడం లేదని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కమీషనర్‌ను ప్రశ్నించారు. స్పందించిన కమీషనర్ పనులను సదరు కాంట్రాక్టర్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఏ ఈ సందీప్‌ను కమీషనర్ ఆదేశించారు. అనంతరం మున్సిపల్ ఏ జెండాలోని అంశాలను చదివి వినిపించారు. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఏ సిపి కార్యాలయానికి కంపౌండ్ వాల్ నిర్మాణానికి మున్సిపల్ జనరల్ ఫండ్‌ను రూ. 13.50 లక్షలు పట్టణంలో 52 సిసి కెమెరాల నిర్వాహాణకు రూ. 4.80 లక్షలు, కంట్రోల్ రూం నిర్వాహాణ ఖర్చు రూ. 55 వేలు, 2018-19 సంవత్సరం వరకు 52 సిసి కెమెరాల నిర్వాహాణ ఖర్చు రూ. 10.70 లక్షలు, లార్వెన్ ఐ జోన్ మంచిర్యాలకు చెల్లించుట నూతన ఏసిపి కార్యాలయంలో సిసి రోడ్లు నిర్మించేందుకు 4.66 లక్షలు, పట్టణంలోని త్రాగు నీటి సమస్యను ఎదుర్కోంటున్న వార్డులలో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా త్రాగు నీటి సరఫరా చేసేందుకు రూ. 56.160, రెండు వాటర్ ట్యాంకర్లు అద్దెకు రూ. 44,928, చేతి పంపుల నిర్వాహాణ నిధులు రూ. 1 లక్ష 67 వేల 180 రూపాయల టెండర్‌కు అమోదం తెలిపారు. కాగా పోలీస్ శాఖకు ఏసిపి కార్యాలయ ప్రహారీ సిసి రోడ్లకు, 52 సిసి కెమెరాల డబ్బులు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూపాయలు దాదాపు 30 లక్షలకు పైగా ఎందుకు కేటాయిస్తున్నారని కౌన్సిలర్ బొల్లం పూర్ణిమా అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు మున్సిపాలిటీలో నిధులే లేవని చెబుతూ జనరల్ ఫండ్ లేదంటూ పోలీస్‌శాఖకు ఎలా నిధులు కేటాయిస్తారని చైర్ పర్సన్ పసుల సునితరాణిని బొల్లం పూర్ణిమా ప్రశ్నించారు. ఈ విషయమై చైర్ పర్సన్ సమాధానం దాట వేసారు. పట్టణంలో ప్రజలు త్రాగు నీటితో అల్లాడుతున్నారని , 7వ వార్డులో వీధి లైట్లు చౌక్‌లు లేకపని చేయడం లేదని కౌన్సిలర్ యూసుఫ్ కమీషనర్‌ను ప్రశ్నించారు. 17వ వార్డులో సిసి రోడ్లు లేవని గోదావరి త్రాగు నీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు.
వార్డులలో త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ట్రాక్టర్ల ద్వారా త్రాగు నీరు సరఫరా చేయాలని పలువురు కౌన్సిలర్‌లు సమావేశంలో ప్రస్తావించగా స్పందించిన కమీషనర్ మల్లారెడ్డి, మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయవద్దని అదేశించారని తెలిపారు. అనంతరం తాయి బజార్ టెండర్ ద్వారా రూ. 7.62 లక్షలు వసూల్ చేసేందుకు తీర్మాణించారు. పశువుల సంత ద్వారా రూ. 20,800 వసూల్ చేసేందుకు మరో తీర్మాణం ఆమోదించారు. ఈ ప్రత్యేక సమావేశంలో పోలీస్ పహారా మధ్య జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. అనంతరం మున్సిపల్ సమావేశం ప్రారంభానికి ముందు నర్సంపేట నగర పంచాయతీ చైర్మన్ రామచంద్రయ్య మృతికి సంతాపంగా వౌనం పాటించి సంతాపం తెలిపారు.