అదిలాబాద్

గోవధశాలపై కౌన్సిల్‌లో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 29: ఆదిలాబాద్ పట్టణ శివారులోని కచ్‌కంటి రహదారిపై కొనసాగుతున్న గోవదశాలను ఎత్తివేయాల్సిందేనని, ఇందుకోసం అందోళనకు సిద్దమేనని బిజెపి కౌన్సిలర్లు స్పష్టం చేశారు. శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ ఫారుఖ్ ఆహ్మాద్‌తో పాటు ఎంఐఎం కౌన్సిలర్లు గోవదశాలను ఎత్తివేయవద్దని నిరసనకు దిగారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో బిజెపి, ఎంఐఎం కౌన్సిలర్ల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బిజెపి కౌన్సిలర్ జోగురవి, కాంగ్రెస్ కౌన్సిలర్ జ్యోతి కల్పించుకొని కచ్‌కంటి గ్రామశివారులో ఉన్న గోవదశాలను అక్కడి నుండి తరలించాలని, ఇందిరమ్మ కాలనీకి, కచ్‌కంటి వెళ్ళే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చైర్‌పర్సన్ మనీషా కలుగజేసుకొని గోవదశాలపై మంత్రి జోగురామన్నతో చర్చించి, సుదూర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది కల్గకుండా గోవదశాలకు స్థలాన్ని కేటాయించేలా చూద్దామని సర్దిచెప్పారు. దీంతో శాంతించిన ఎంఐఎం కౌన్సిలర్లు పోడియం నుండి వెళ్ళిపోయారు. అనంతరం గత రెండు సంవత్సరాల నుండి ఈద్గా వద్ద పైపులైన్ వేయకపోవడంతో వర్షపునీరు నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి పైపులైన్ వేయాలని డిమాండ్ చేశారు. చైర్‌పర్సన్, కమిషనర్ కల్పించుకొని పైపులైన్ల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని అన్నారు. అదే విధంగా రూ.2కోట్ల విలువైన గణేష్ థియేటర్ స్థలం లీజు గడవు ముగిసిందని, దానిపై అధికారులు వెంటనే స్పందించి అద్దె భవనాల బిల్లులు వసూలు చేయాలని మున్సిపల్ వైస్ చైర్మెన్ డిమాండ్ చేయగా కమిషనర్ మంగతయారు కల్పించుకొని గణేష్ థియేటర్, సంబంధిత లీజు భవనాల అద్దె బిల్లులకై ప్రతి నెల నోటీసులు పంపిస్తున్నామని, గడవులోగా స్పందించినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకుముందు వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మంగతయారుతో పాటు ఈఈ నాగమల్లేశ్వర్‌రావు, శానిటరి ఇన్స్‌పెక్టర్ జగదీశ్వర్, ఆయాజ్, ఏఈలు నవీన్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాసరలో అక్షరాభ్యాస సందడి
బాసర, ఏప్రిల్ 29: బాసర అమ్మవారి సన్నిధిలో శనివారం అక్షయతృతీయను పురస్కరించుకుని అక్షరాభ్యాస సందడి నెలకొంది. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ముహూర్తబలం ఉదయమే ఉండడంతో భక్తులు తమ చిన్నారులతో అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడాయి.
ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అమ్మవారి సన్నిధిలో 600 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. సుమారు రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారానే
రిజర్వేషన్లు ఇవ్వాలి
మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 29: ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన నేపథ్యంలో వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు కల్పించనున్న 10శాతం రిజర్వేషన్లను వెంటనే జీవో ద్వారా అమలయ్యే విధంగా చూడాలని మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. శనివారం మాలీల సమగ్ర సర్వే వివరాల సేకరపై సంఘ భవనంలో మాలీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 16న నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రిజర్వేషన్ల పెంపుకోసం బిల్లును ప్రవేశపెట్టిందని, దాన్ని కేంద్రానికి పంపినట్లయితే అందులో ముస్లీం రిజర్వేషన్ల విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. దానికి బదులుగా తమిళనాడు తరహాలో జీవోను విడుదల చేసి విద్యా, ఉద్యోగాల్లో గిరిజన జనాభాకు అనుగుణంగా 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందులో మాలీలను ఎస్టీలో కలుపుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి, వెంటనే మాలీల సర్వే పూర్తిచేయించి ఎస్టీ హోదా కల్పించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 25శాతం మాలీ గ్రామాల్లో 96శాతం సర్వే పూర్తయిందని, మిగితా 10శాతం కూడా రెండు మూడు రోజుల్లో పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని మాలీ సంఘం నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ గుర్నులే, ప్రధాన కార్యదర్శి సాంబన్న శెండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గుర్కులే, జిల్లా అధ్యక్షులు విజయ్ వాడ్గురే తదితరులు పాల్గొన్నారు.