అదిలాబాద్

ప్రజలను మోసం చేస్తున్న కేసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, మే 2: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. మంగళవారం ఇచ్చోడలో జరిగిన జిల్లా స్థాయి పార్టీ క్రీయశీలక కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అధ్యక్షతన జరగగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో గిరిజన తాండాలు, గూడేలాను గ్రామపంచాయతీలుగా మారుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసి ఆర్ దీనిపై ఊసేత్తకపోవడం శోచనీయమని అన్నారు. గిరిజనులకు మూడెకరాల భూమి ఇంత వరకు ఎక్కడా అమలు చేయలేదన్నారు. రాజధాని హైదరాబాద్‌లో బంజార భవన్‌కు భూమిపూజ చేయగా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని, గిరిజనులపై కపట ప్రేమ చూపుతున్న ముఖ్యమంత్రి గిరిజనుల అభివృద్దికి ఎలాంటి కృషి చేయడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పి ఆర్‌సి కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. రైతుపక్షపార్టీగా ప్రకటించుకుంటున్న ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని, ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పటిష్టం చేయడానికి బూత్‌స్థాయి నుండి కమిటీలను నియమించడం జరుగుతుందని, 2019లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి 23, 24, 25 తేదీలలో మూడు రోజుల పాటు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ సైనికుల్లా కృషి చేయాలని, రానున్న ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో సుహాసిని రెడ్డి, శ్రీరాంనాయక్, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.