అదిలాబాద్

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో రాష్టవ్య్రాప్తంగా వేలాది చెరువులకు పూర్వ వైభవం లభిస్తుందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం గొల్లపేట చెరువులో మిషన్ కాకతీయ 3వ విడత పూడికతీత పనులను ఆయన మట్టితీసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ చెరువుల్లో నిల్వ ఉన్న పూడిక పంట పొలాల్లో వేసుకుంటే సేద్యపుభూమిలో పోషకాలు పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఇప్పటికే మిషన్ కాకతీయ పథకానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడంతో తెలంగాణ రాష్ట్రానికి ఎంతోపేరు లభించిందన్నారు. కాకతీయుల, నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చెరువులు నిరాధారణకు గురికావడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ముందుచూపుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రైతులు పనులు సక్రమంగా జరిగేటట్లుగా పర్యవేక్షించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రతీ చెరువును కుంటలను మరో రెండేళ్లలో బాగుచేయనున్నామన్నారు. అలాగే మిషన్ భగీరథ పథకం కింద ప్రతీ ఇంటికి తాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాగు, తాగునీటికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని మెచ్చుకోవడం జరిగిందన్నారు. దేశంలోనే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ పథకాలపై ఆరాతీయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ దేవేందర్ రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి కొండాపూర్ వరకు రూ.25 కోట్లతో నిర్మించనున్న రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి నగేష్ శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణతో రహదారిపై ప్రయాణీకుల ఇబ్బందులు తప్పనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్‌లేన్‌లో సాయికృష్ణ డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించారు.