అదిలాబాద్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 15: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు మృతి చెందగా, నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఆటో చేట్టుకు ఢీకొట్టిన ప్రమాదంలో మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతరాష్ట్ర రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్టల్రోని మాండ్వి గణేష్‌పూర్‌కు చెందిన యోగేష్ (24), సుభాష్ (25) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. భీంపూర్‌లో తమ బంధువుల ఇంట్లో పెళ్ళికోసం మోటర్ సైకిల్‌పై నలుగురు యువకులు వచ్చి తిరిగి వెళ్తుండగా.. భీంపూర్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో బైక్‌పై ఉన్న నలుగురు యువకుల్లో యోగేష్, సుభాష్ అక్కడికక్కడే మృతిచెందగా హన్మంత్, విజయ్ అనే ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు మద్యం సేవించి అతివేగంతో డ్రైవింగ్ చేయడంవల్లే బస్సు చక్రాల కిందపడి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు మహిళల దుర్మరణం
కడెం: మండలంలోని కల్లెడ పంచాయతీ దోస్త్‌నగర్ సమీపంలోని జాతీయ రోడ్డు వంతెన వద్ద సోమవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా... జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిత్రవేణి గుడెం గ్రామానికి చెందిన పలువురు కడెం మండలం చిట్యాలలో సోమవారం జరిగిన వివాహ వేడుకలకు వచ్చి తిరిగి వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటో దోస్త్‌నగర్ వంతెన వద్ద చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదంలో బీర్పూర్ మండలం చిత్రవేణి గూడానికి చెందిన ఊర్వత భీంబాయి (50), చిక్రం మధుబాయి (65) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా. అదే గ్రామానికి చెందిన చిక్రం గంగుబాయి, చిక్రం భీంబాయి, పార్వతి, మధూకర్, పార్వతి, మర్సుకోల జంగుబాయి తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్త్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బాలకృష్ణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని తెలుస్తోంది.

బాధితుల సమస్యలను పరిష్కరించాలి
* నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
దివ్యనగర్, మే 15: పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయడానికి వచ్చే బాధితులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను పరిష్కరించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్‌కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఐదుగురు బాధితులు హాజరై సమస్యలను వివరించి ఆర్జీలు అందజేశారు. వారి సమస్యలను తెలుసుకుని వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాఫిర్యాదుల విభాగంలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీతోపాటు పెట్రోలింగ్, కాలనీల్లో అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్ ఎస్సై, సి ఐలకు 8333986939 సెల్‌కు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పనిచేయాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.