అదిలాబాద్

అధికారాన్ని అడ్డంపెట్టుకుని భూ కబ్జాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 15: అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరమని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ నిర్మల్ నడిఒడ్డున గల ధర్మసాగర్ చెరువులో సుమారు 25 ఎకరాలు మంత్రి కబ్జాచేశారని ఆరోపించారు. అధికారం ముసుగులో సిగ్గులేకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైలెవల్ కెనాల్ పేరుతో ప్రజాధనాన్ని దోపిడి చేస్తున్నారని, భూములు కోల్పోయిన వారికి ఇప్పటికి నష్టపరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. భూ కబ్జాలపై యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్‌యు ఐ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ధర్నా నిర్వహించడం జరుగుతుందని, అయినప్పటికి స్పందించకుంటే తానే 48 గంటల నిరాహారదీక్షకు పూనుకుంటానన్నారు. అంబేద్కర్ సాక్షిగా ధర్మసాగర్ చెరువు అభివృద్ది పేరుతో కబ్జాకు గురవుతున్నా, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదన్నారు. ఓవైపు మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్దరిస్తున్నామని చెబుతూనే మరోవైపు చెరువులను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆగ్రహాన్ని గమనించకపోవడం శోచనీయమన్నారు. కల్లముందే దోపిడి జరుగుతున్నా అధికారులకు కనిపించకపోవడం బాధాకరమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతుల, ప్రజలపక్షాన పోరాటానికి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి భూ కబ్జాలను బయటపెడతానని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అడిచెర్ల రామలింగం, తక్కల రమణరెడ్డి, అయ్యన్నగారి పోశెట్టి, నాందేడపు చిన్ను, దినేష్, మొయిన్, అజర్, ప్రవీణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణాభివృద్ధే ధ్యేయం
* ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు
మందమర్రి, మే 15: పట్టణ ప్రజల అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పేర్కొన్నారు. సోమవారం మందమర్రి మార్కెట్ నుంచి రామకృష్ణాపూర్ బీజోన్ మీదుగా హైదరాబాద్‌కు నూతన బస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు దూర భారాన్ని తగ్గించేందుకు పట్టణం నుంచి హైదరాబాద్‌కు నూతన బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కోల్‌బెల్ట్ ప్రజల, పట్టణ ప్రజల సంక్షేమం కోసం తాను మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా త్వరలో మార్కెట్ నుంచి ఒక ఏసి బస్సుతో పాటు మరొక్క బస్సును హైదరాబాద్‌కు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలు మంచిర్యాలకు వెళ్లి టికేట్ల కోసం ఇబ్బందులకు గురవుతున్నారని గమనించి ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల డిపో మేనేజర్ కృష్ణ తో పాటు టిఆర్‌ఎస్ నాయకులు రవీందర్, సంపత్, సూరిబాబు, ఎస్ ప్రభాకర్, వైద్యం ప్రసాద్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్జీలు స్వీకరించిన ఏపివో జనరల్
ఉట్నూరు, మే 15: గిరిజన సమస్యల పరిష్కారానికి ఐటిడి ఏ కార్యాలయంలో సోమవారం గిరి దర్బార్ ఏర్పాటు చేయగా ఐటిడి ఏ ఏపివో జనరల్ గోరావు ఆర్జీలను స్వీకరించారు. గత కొంతకాలంగా రెగ్యులర్ అధికారి లేకపోవడంతో తమ సమస్యలు పరిష్కారం కావన్న అపనమ్మకంతో గిరిజనులు అంతంతమాత్రంగానే తరలివచ్చారు. దీనికి తోడు అధికారులు సైతం గైర్హాజరు కావడంతో గిరి దర్బార్ వెల వెల బోయింది. పదుల సంఖ్యలో వచ్చిన గిరిజనుల నుండి ఏపివో జనరల్ నాగోరావు ఆర్జీలు స్వీకరించి, ఆయా శాఖల అధికారులకు వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా గతంలో వచ్చిన ఆర్జీల్లో ఏమేరకు పరిష్కరించబడ్డాయో అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
* ఎల్లంపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక
మంచిర్యాల, మే 15: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎల్లంపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన భూముల కింద పరిహారం చెల్లించాలని పలువురు ఫిర్యాదులను అందజేసారు. అదే విధంగా సింగరేణి ప్రాంతంలోని ఓపెన్ కాస్టు గనుల కింద భూములు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. వృద్దాప్య ఫించన్‌లు, వికలాంగులతో పాటు భూ సమస్యలు, తదితర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయా శాఖాలకు ఫిర్యాదులను అందజేసి సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా చూడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాల అధికారులతో రెవెన్యూ శాఖ అధికారి పాల్గోన్నారు.