అదిలాబాద్

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యనగర్, ఏప్రిల్ 4: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా సమస్యల దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. అలాగే చిన్నారులకు టీకాలు వేయించడానికి ఇంధ్రధనస్సు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రెండేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. దీపం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే సిలెండర్లను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం జగ్జీవన్‌రావు జయంతిని నిర్వహించనున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ నారాయణ, మున్సిపల్ కమీషనర్ త్రయంబకేశ్వర్‌రావు, సహాయ కార్మికశాఖ అధికారి ముత్యంరెడ్డి, ఇన్‌చార్జి డిఎవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

భైంసా రూరల్, ఏప్రిల్ 4: మండలంలోని కుంసర గ్రామనికి చెందిన సోలంకి సాయినాథ్(45)అనే రైతు అప్పుల బాధ తో సోమవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు సంవత్సరాలుగా ఆశించిన మేర పంట దిగుబడి రాకపోవడంతో పంట సాగుకై 2 లక్షల 80 వేల రూపాయలు అప్పుచేసిన రైతు అప్పులు ఎలా తీర్చాలన్న దిగులుతో తన పంట పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.