అదిలాబాద్

సింగరేణిలో సమ్మె సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూన్ 15: వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, డివిజన్‌లలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. బెల్లంపల్లి రిజియన్ వ్యాప్తంగా 90 శాతం మంది కార్మికులు గైర్హాజరయ్యారు. అత్యవసర విధులు మినహా దాదాపుగా సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది. జాతీయ కార్మి క సంఘాలు ఒక్కొక్క గని పై సమీక్షలు నిర్వహిస్తు సమ్మెకు మద్దతు నివ్వాలని కార్మికులను కోరారు. గత నెల 30 నుంచి జాతీయ కార్మిక సంఘాలు సమ్మె పిలుపుకు సన్నాహాలు చేస్తు సమ్మెపై విసృత్త ప్రచారం చేయడంతో నేటి నుంచి నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 13 హైదరాబాద్‌లో డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమీషనర్ వద్ద జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె తప్పనిసరి అని జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో టిబిజికే ఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు జే ఏసి గా ఏర్పడి సమ్మెను ముందుకు తీసుకెళ్తున్నాయి. సింగరేణివ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో ముందస్తుగా కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీసుల అదుపులోకి తీసుకుంటున్నారు. అయినప్పటికీ కార్మికులు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొంటూ తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు. అదే విధంగా సింగరేణి కార్మిక బిడ్డల సంఘం నాయకులు ఇతర సంఘాల నాయకులు కార్మక వాడల్లో తిరుగుతూ వారసత్వ ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగులుగా మిగిలిపోతామని మీరు సమ్మె చేస్తే యజమాన్యం ప్రభుత్వం, దిగి వచ్చి వారసత్వంపై పునరాలోచించడం వల్ల మాకు ఉద్యోగం అన్న వస్తుందనే గంపెడు ఆశతో ఉన్నామని ఎలైగైనా విధులకు హాజరు కావద్దని కోరుతున్నారు. సమ్మె పిలుపులో భాగంగా సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుండా మల్లేష్ అబ్బాపూర్ ఓ సిపి గని వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకోని అదుపులోకి తీసుకున్నారు. అదే విధం గా బెల్లంపల్లి డివిజన్ వ్యాప్తంగా 5 జాతీయ కార్మిక సంఘాలతో పాటు కార్మిక బిడ్డల సంఘాల నాయకులతో పాటు 52 మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని 9 భూగర్భ గనులు, 1 ఓసిపిలలో 20 శాతం మంది కార్మికులు విధులకు హాజరైన్నారు. అదే విధంగా బెల్లంపల్లి, మందమర్రి డివిజన్‌లో కూడా కార్మికులు దాదాపు 20 శాతం మేరకే విధులు నిర్వహించారు. విధులకు హాజరైన కార్మికులకు గనులు, ఓసిపిలపైన యజమాన్యం విందులు ఏర్పాటు చేస్తు గనులపైనే అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. సమ్మెలో భాగంగా జాతీయ కార్మిక సంఘాలు కార్మిక వాడలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సింగరేణి కార్మిక బిడ్డల సంఘం ఆధ్వర్యంలో కాలనీలలో తిరుగుతూ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. అదే విధంగా శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్, షిర్కే కాలనీ వద్ద హెచ్ ఎం ఎస్ ఆధ్వర్యంలో వారసత్వ ఉద్యోగ వ్యతిరేక శక్తుల దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. ఆర్కే 1 ఏ భూగర్భ గనిలో పోలీసులను మోహరింపి కార్మికులతో రాత్రి షిప్ట్‌లలో ఎస్ డి ఎల్ ఆపరేటర్లతో బొగ్గు ఉత్పత్తికి ఆటాంకం కలుగకుండా పనులు చేయిస్తున్నారు. రిజియన్ వ్యాప్తంగా యజమాన్యం డైరెక్టర్ స్థాయి అధికారులను కేటాయించి సమ్మెపై ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తు సమ్మెను విచ్చిన్నం చేసేందుకు కార్మికులకు విందులు ఏర్పాటు చేసి విధులు నిర్వహించేందుకు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గనులపైభారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డిసిపి జాన్‌వెస్లీ, ఏ ఎస్పి కవితల నేతృత్వంలో పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు, కేవలం 3, 4 రోజులు మాత్రమే రవాణా చేసేందుకు అవకాశం ఉందని నిరవధిక సమ్మె కొనసాగితే బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి బొగ్గు ఆధారిత పరిశ్రమలకు రవాణా చేయలేకపోతున్నామని అదికారులు చెబుతున్నారు. దీనితో విద్యుత్, పవర్ ఫ్లాంట్‌కు బొగ్గు సరఫరా కాకపోవడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి రాష్ట్రం అందకారంలోకి వెళ్లే అవకాశం ఉంది. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.