అదిలాబాద్

సమాజ సేవకు ఆర్యవైశ్యులు ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 16: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆర్య వైశ్యులు ఎల్లప్పుడు ముందుండాలని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్ కె కనె్వన్షన్ హల్‌లో గురువారం రాత్రి ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, ఆభివృద్ది కార్యక్రమాలను చేపడుతోందన్నారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కె సి ఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాజకీయంగాను ఆర్యవైశ్యులు ఎదగడానికి వివిధ పదవులను కేటాయించారని అన్నారు. ఆర్యవైశ్యుల్లో చాలా వరకు ఆర్థికంగా ఆభివృద్ది చెందిన వారు ఉంటారు కాబట్టి సమాజ సేవ చేయడంలో వారు ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. అంతకు ముందు ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఆమెడ కిషన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ది కోసం గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టి ఆర్ ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేస్తోందని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచనల మేరకు సామాజిక సేవలో ముందుంటామని హమి ఇచ్చారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతుల తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీరోత్సవ కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ వి ఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, రాష్ట్ర హ్యండిక్రాప్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంపత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, గ్రంథాల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నాయకులు రాంకిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పొడెల్లి గణేష్, జిల్లా పి ఆర్‌వో పత్తి శివప్రసాద్, స్థానిక వ్యాపారులు ఆమెడ మారుతి, పొలిశెట్టి కిషన్, ఆమెడ శ్రీనివాస్, ఆమెడ దేవేందర్, శ్రీ్ధర్, భిక్షపతి, జొన్నల మహేష్, తగిలిపెల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా ఆమెడ కిషన్, ప్రధాన కార్యదర్శిగా నూకల దయాకర్, కోశాధికారిగా చిలమంతుల సంజీవ్‌లు ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఐ వి ఎఫ్ నిర్మల్ జిల్లా మహిళ కార్యవర్గ అధ్యక్షురాలిగా కమలేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా అమెడ లావణ్య, కోశాధికారిగా కె. సంధ్యరాణిలు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అలాగే యూత్ కార్యవర్గంలో అధ్యక్షులుగా వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా చిటికెశి సంతోష్, కోశాధికారిగా అమెడ సాకేత్‌లు ఉన్నారు. అలాగే ఐ వి ఎఫ్ పట్టణ కార్యవర్గంలో అధ్యక్షులుగా సంతోష్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా పోశట్టి, కోశాధికారిగా రామ్‌నారాయణలు ఉన్నారు. విరితో పాటు పట్టణ మహిళ కార్యవర్గం, పట్టణ యూత్ కార్యవర్గం, జిల్లా మహిళ యూత్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.