అదిలాబాద్

తెగిన తాత్కాలిక వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జూన్ 16: భైంసా మండలంలోని గుండెగాం గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన భారీ వర్షాలకు కూలి పోవడంతో మహరాష్టత్రో పాటు భైంసా మండలం మహగాం, కుభీర్ మండలం పార్డీ, హల్ద గ్రామాలతో పాటు మహరాష్టల్రోని హిమాయత్ నగర్, రంగశివని, అంద్‌బోరి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి. తాత్కాలిక వంతెన కూలీపోయి రాకపోకలు నిలిచి పోయాయి. వందలాది మంది రోడ్డు మార్గంలో భైంసాకు వ్యవసాయ పనుల నిమిత్తంతో పాటు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. తాత్కాలిక వంతెన కూలిపోవడంతో దూర భారమైనప్పటికి చింతల్‌బోరి, మహటెగాంల మీదుగా భైంసాకు చేరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వంతెన కూలి పోయిన స్థలాన్ని పరిశీలించి తాత్కాలిక వంతెనను పునరుద్దరించాలని అదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగా చూడాలని అన్నారు.

వారసత్వం పోగొట్టిన సంఘాలే సమ్మె చేయడం విడ్డూరం
* ముఖ్య మంత్రిపై విశ్వసంతోనే సమ్మెకు దూరం
* టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు
శ్రీరాంపూర్ రూరల్, జూన్ 16: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిన జాతీయ కార్మిక సంఘాలే నేడు వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మె చేయడం విడ్డూరంగా ఉందని టిబిజికె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి.వెంకట్రావు అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో టిబిజికెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్యలతో కలసి మాట్లాడారు. నల్లటి నేలపై ఎర్రటి నెత్తుటి పారడానికి ఎర్రజెండాలే కారణమన్నారు. వారసత్వ ఉద్యోగపు హక్కును టిబిజికెఎసే ఇప్పిస్తుందని, కెసిఆర్ ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకంతోనే కార్మికులు విధులకు హాజరవుతున్నారని తెలిపారు. వారసత్వం ఉద్యోగపు హక్కును పోగొట్టిన సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికులు వారిని విశ్వసించడం లేదన్నారు. కార్మికులు అడగకుండానే ముఖ్య మంత్రి కెసిఆర్ వారసత్వపు ఉద్యోగం ప్రకటిస్తే ఎఐటియుసి తదితర సంఘాలు ఇతరులతో కోర్టులో కేసు వేయించి అడ్డుకున్నాయని అన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ వారసత్వం ఇచ్చి కార్మికుల పక్షపాతిగా నిలబడుతారని పేర్కోన్నారు.గతంలో ఏ ఐటియుసి గెలిచిన ఏరియాలలోనే కార్మికులు 100 శాతం సాధిస్తున్నారని పేర్కొన్నారు. మాస్టర్‌కోత చట్టానికి వ్యతిరేకంగా జరిగిన సమ్మె, టెక్నిషన్‌న్ల 90 రోజుల సమ్మెను శ్రీకృష్ట కమిటికి వ్యతిరేకంగా జరిగిన సమ్మెలో ఎఐటియుసి ఉద్రోహపూరిత పాత్రను పోషించలేదని గుర్తు చేసారు. సమ్మె వల్ల వారసత్వం ఉద్యోగాలు అమలు జాప్యం అవుతుందని పేర్కొన్నారు. ఉనికికోసం సమ్మె చేయడం సమస్యలను జఠిలం చేయరాదన్నారు. కార్య క్రమంలో టిబిజికెఎస్ కేంద్రనాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, బంటు సారయ్య పెద్దపెల్లి కోటిలింగం, మంద మల్లారెడ్డి, వీరభద్రయ్య, కాశీరావు, సిహెచ్ అశోక్, రాఘవరెడ్డి, లెక్కల విజయ్, సురేందర్ రెడ్డి, జక్కుల రాజేశం వివిధ గనులు ఫిట్ కార్యదర్శులు పాల్గొన్నారు.