అదిలాబాద్

పొంచి ఉన్న వ్యాధులపై తస్మాత్ జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైనూర్, జూన్ 16: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నందున వైద్య సిబ్బంది వ్యాధుల నివారణకు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మురికి నీటి కాలువల్లో దోమలు నిల్వ ఉండకుండా పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కుమురంభీం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు హెచ్చరించారు. ఎడీవో సమావేశ మందిరంలో శుక్రవారం జైనూర్, సిర్పూర్‌యు, లింగాపూర్ మండలాల్లోని వైద్య సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సెక్రెటరీలు, ఆశావర్కర్లు, ఐసిడి ఎస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమైన వైద్యసిబ్బంది హెడ్‌క్వాటర్స్‌లో ఉంటూ ప్రజలకు ఎళ్ళవేళలా వైద్యసేవలందించాలన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజల ఆరోగ్య స్థితి గతులు, వారికి అందిస్తున్న వైద్యసేవలపై ప్రత్యేక యాప్‌ను రూపోందించడం జరిగిందన్నారు. వైద్యశాఖ అధికారులు వ్యాధుల నివారణ కోసం చేస్తున్న కృషి ఈ యాప్‌లో నమోదవుతుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, దీని మూలంగా అతిసార, పచ్చకామెర్లు, టైపాయిడ్, డయేరియా వంటి వ్యాధులతోప్రాణాలు సైతం కోల్పోతున్నారన్నారు. కుమురంభీం జిల్లా పంచాయతీ అధికారి గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో పరిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది ప్రభుత్వ ఉద్యోగులందరూ సమష్టికృషి మూలంగా ఏజెన్సీలోని ఎలాంటి ప్రాణహాని జరగలేదని, అదే స్పూర్తితో ప్రతి ఒక్కరు పనిచేస్తూ గ్రామీణ ప్రజల ఆరోగ్యపరిరక్షణకు దోహదపడాలన్నారు. తాగునీటి వనరులు వారంలో రెండుసార్లు క్లోరినేషన్ చేపట్టాలన్నారు. గ్రామాల్లో నల్లాలు, డ్రైనేజీలు, చేతిపంపులు చెడిపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి అల్హాం రవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ లక్ష్మణ్‌రావు, తహసీల్దార్ శంకర్ గౌడ్, ఎంపిడీవో బానోత్ దత్తారాం, సిడిపివో ప్రభావతి, ఈవోపిఆర్‌డి కృష్ణరావు, ఆర్‌ఐ బాబుసింగ్, ఏఈలు ఖలీల్, సూపర్‌వైజర్లు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డెక్కిన ఎడారి వాహనం
దండేపల్లి, జూన్ 16: సహజంగా ఒంటెలు రాజస్థాన్ ఎడారిలోనే ఎక్కువగా కన్పిస్తాయ. అక్కడి గొర్రెల కాపారులు పశువుల మేత కోసం ఇతర ప్రాంతాలకు వీటిపై సంచరిస్తుంటారు. వారి సామాగ్రిని మోయడంకోసం ఒంటెలను తీసుకువస్తారు. ఇలా శుక్రవారం, సుమారుగా 10 ఒంటెలను మండల కేంద్రం నుండి గ్రామాలకు తీసుకువెళుతుండగా విద్యార్థులు, చిన్నారులు ఎడారి వాహనాన్ని అసక్తిగా తిలకించారు.