అదిలాబాద్

త్వరలో జిల్లాల్లో పోలీసు కార్యాలయ భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, జూన్ 16: రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కార్యాలయ భవనాలను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసిందని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లెటి దామోదర్ తెలిపారు. శుక్రవారం నిర్మల్‌లోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల కార్యాలయాలను ఒకేచోట నిర్మించడం వల్ల ప్రజలకు అనువుగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కార్యాలయ భవనాలను నిర్మించాలని నిర్ణయించారన్నారు. నిర్మల్‌లో ఈ భవనాలను నిర్మించనున్న భీమన్నగుట్ట ప్రాంతాన్ని పరిశీలించామని, అది ఎంతో అనువుగా ఉందన్నారు. నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయ సముదాయాన్ని అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడే నిర్మించనున్నమన్నారు. ఇందుకోసం రూ.12 కోట్లు మంజూరయ్యాయని, త్వర్వలోనే టెండర్ పిలిచి పనులు భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో కొత్తగా మూడు పోలీసు స్టేషన్‌లకు నూతన భవన నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. లక్ష్మణచాందలో ఇప్పటికే భనవ నిర్మాణం ప్రారంభం కాగా, దిలావార్‌పూర్, దస్తురాబాద్ పోలీసుస్టేషన్‌ల నిర్మాణాలను త్వరలోనే చేపడతామన్నారు. అలాగే సోన్‌లో సర్కిల్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఆయా పోలీసు స్టేషన్‌ల భవనాల కోసం స్థల సేకరణ పూర్తి అయిందని వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్మల్ జిల్లా పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సమావేశంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.