అదిలాబాద్

గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ఐటిడిఏ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో ఆవసం ఉంటున్న గిరిజనుల అభివృద్దికి ఐటిడి ఏ ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఐటిడి ఏ ఏపివో జనరల్ నాగోరావు అన్నారు. మంగళవారం 71వ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా ఐటిడిఏ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ గిరిజనాభివృద్దే లక్ష్యంగా వారిని అన్ని రంగాల్లో అభివృద్దిపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటిడిఏ ద్వారా కృషి చేస్తున్నాయని అన్నారు. దీనిలో భాగంగా విద్యాభివృద్ది కోసం ఐటిడి ఏ అధ్వర్యంలో నడుస్తున్న 483 గిరిజన ప్రాథమిక పాఠశాలలు, 54 ఆశ్రమ పాఠశాలలు, 22 గురుకుల పాఠశాలల్లో 32,857 మంది గిరిజన విద్యార్థులకు అన్ని వసతులతోకూడిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో సి ఆర్టీలను నియమించి, మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో తరచూ అంటు వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు ఏజెన్సీ వ్యాప్తంగా 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 186 ఉప కేంద్రాల ద్వారా ఉచిత వైద్యసేవలు అందజేస్తున్నామని అన్నారు. అదే విధంగా గర్భిణీలకు 1,226 కెసి ఆర్ కిట్లను అందించామని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ది కోసం ఐటిడి ఏ ద్వారా వివిధ పథకాలతో అభివృద్దిపర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా 137 కోట్ల నిధులతో 256 భవన నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. మరో 73 కోట్లతో ఏజెన్సీ వ్యాప్తంగా రోడ్ల సౌకర్యం కోసం 93 కోట్ల నిధులు మంజూరు కాగా వాటిలో 90శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. రెండు పడకల ఇండ్ల నిర్మాణం కోసం 13కోట్ల రూపాయలు కేటాయించగా, 210 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇవేకాకుండా అన్ని రంగాల్లో అభివృద్దిపర్చేవిధంగా నిధులు కల్పిస్తూ వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టగా పలువురిని అలంరించాయి. ఈకార్యక్రమంలో ఆదిమ గిరిజన సంక్షేమ సలహా మండలి చైర్మెన్ లక్కెరావు, పాలన అధికారి పెందూర్ భీం, ఏజెన్సీ వైద్యాధికారి కుమ్ర బాలు, ఉప వైద్యాధికారి వసంత్‌రావు, ప్రత్యేకాధికారి సనత్‌కుమార్ శాస్ర్తీ, జడ్పీటీసీ జగజీవన్, ఎంపిపి విమల రాథోడ్, ఉట్నూరు సర్పంచ్ బొంత అశారెడ్డి, డిటిడివో పోశం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.