అదిలాబాద్

రైతుల ఆత్మహత్యలు పట్టవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యనగర్, ఏప్రిల్ 4: పంటలు పండక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమేరకు సబబని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు అయ్యన్నగారి భూమయ్య ప్రశ్నించారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇప్పటివరకు 2 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కేవలం 450 మంది మాత్రమే ఆత్మహత్యచేసుకున్నారని పేర్కొనడం విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక టి ఆర్ ఎస్ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతుందని మండిపడ్డారు. రైతులకు ఏవిధంగా కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడం బాధాకరమన్నారు. రైతు రుణమాఫిని దశలవారీగా చేపట్టడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఇతర పార్టీల్లోని నాయకులను, ప్రజా ప్రతినిధులను టి ఆర్ ఎస్‌లో చేర్చుకుంటూ రాజకీయ వ్యభిచారానికి టి ఆర్ ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం సూచనలను కేసి ఆర్ ప్రభుత్వం బేఖాతరుచేసిందని వాపోయారు. ప్రజలను మభ్యపెట్టే పనులను మానుకోవాలన్నారు. మత కలహాలను ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో టి ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బిజెపి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం చేపడుతున్న పథకాలను గ్రామీణులకు వివరించి వారు లబ్ధి పొందే విధంగా చైతన్యం తెస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుండి 20వ తేది వరకు గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బిజెపిపై పలు పార్టీల నాయకులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. ఏప్రిల్ 6 నుండి బిజెపి వ్యవస్థాపక దినోత్సవ సంబరాలను ప్రతి గ్రామంలో జరుపుతామన్నారు. కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను గ్రామీణులకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో స్వచ్చ్భారత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల రాంనాథ్, బిజెపి నాయకులు రచ్చ మల్లేష్, మెడిసెమ్మ రాజు, ఒడిసెల శ్రీనివాస్, నాలం నరేంధర్, రవివర్మ, సత్యనారాయణ, రాజేందర్, తదితరులు ఉన్నారు.