అదిలాబాద్

మాట తప్పితే జనరల్ ఎన్నికలలో ఓటేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్, సెప్టెంబర్ 22: సిఎం కెసిఆర్ సింగరేణి కార్మికుల బిడ్డలకు వారసత్వ ఉద్యోగాలు ఏ విధంగానైనా ఇచ్చి తీరుతాడని అధికార పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కార్మికులకు భరోసా కల్పించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాటను తప్పితే ఏడాదిన్నర తర్వాత వచ్చే జనరల్ (పార్లమెంట్, అసెంబ్లీ) ఎన్నికలలో టిఆర్‌ఎస్‌కు ఓటు వేయొద్దని అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోవలక్ష్మి పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓసిపిలో శుక్రవారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో వారు పాల్గొని కార్మికులనుద్దేశించి ప్రసగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన సిఎం కెసిఆర్‌కు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించడం ఏ మాత్రము కష్టం కాదన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో టిబిజికెఎస్‌ను ఓడించి సిఎం కెసిఆర్ పాలనకు తెలంగాణలో బ్రేక్ వేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు జాతీయ సంఘాలతో కలిసి కుట్రలు చేస్తున్నడని వారు ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన వచ్చే 20 ఏళ్ల వరకు తెలంగాణకు కెసిఆరె సిఎంగా ఉండటం ఖాయమన్నారు. సింగరేణి కార్మికులను మోసం చేసేందుకే ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి యూనియన్లు అనైతిక పొత్తులు పెట్టుకున్నయని ఆరోపించారు. తాడు, బొంగరం, సిద్ధాంతాలు, నీతి, నిజాయితి లేని ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాల నేతలు వారసత్వ ఉద్యోగాలు తమ వలనే సాధ్యమవుతుందని కార్మికులను మోసం చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నరని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు సిఎం కెసిఆర్ పై నమ్మకం ఉంచి టిబిజికెఎస్‌ను గుర్తింపు సంఘంగా గెలిపించి దసరా కానుకగా ఇవ్వాలని వారు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గుర్తింపు సంఘంగా టిబిజికెఎస్ గెలిస్తే దీపావళి కానుకగా కార్మికుల బిడ్డలకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. టిబిజికెఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యంతో జాతీయ సంఘాలు కుమ్మకై పదో వేజ్‌బోర్డు ఒప్పందంలో కార్మికులను నమ్మించి నట్టెట ముంచాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఐఎన్‌టియుసి మూడు ముక్కలైందని, అందులో ఒక ముక్కను సంజీవరెడ్డి పట్టుకుని వేలాడుతున్నడని విమర్శించారు. ఈసందర్భంగా ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్ సంఘాల నుండి పలువురు నాయకులు టిబిజికెఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.సదాశివ్, ఎం.శ్రీనివాస్‌రావు, డి.మంగిలాల్, బి.శంకర్, జడ్పీటీసీలు మంగపతి సురేష్, అజ్మీర బాబురావు, ఎంపిపి కార్నాధం సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.