అదిలాబాద్

సింగరేణి కార్మికులకు రు.10లక్షల వడ్డీలేని రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, సెప్టెంబర్ 22: సింగరేణి కార్మికులకు స్వంతింటి పథకం ద్వారా రు.10లక్షల రుపాయలను వడ్డీలేని రుణాలను కెసిఆర్ అందించనున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్ రావుపేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఎస్ ఆర్‌పి-1 కార్మికులను కలుసుకొని మాట్లాడారు. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల కృషి మరువలేనిదని, అకుంటిత దీక్షతో కార్మికులు తట్టాచెమ్మస్ పక్కన పెట్టి పోరాటంలోపాల్గొని తెలంగాణ 10 జిల్లాల ప్రజలను ప్రభావితంచేసారన్నారు. ముఖ్య మంత్రికి సింగరేణి కార్మికులపై అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, ఏ రాష్ట్ర ఇవ్వని సమ్మెవేతన సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగిందని గుర్తుచేసారు. అంతేకాకుండా పండగా అడ్వాన్స్ 25 వేలు, పిఎల్‌ఆర్ బోనస్ రు.57 వేలు అక్టోబర్ రెండవ వారంలో కార్మికుని ఖాతాలో జమచేయనున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోకార్మికులు ధర్నాలు, నిరసనలు చేస్తే తప్ప కార్మికులకు చెల్లించేలేని పరిస్థితి అని గుర్తుచేసారు.టిబిజికె ఎస్ ఎండ్లతరబడి ఏ ఓక్క కార్మికున్ని ఉద్యోగం నుండి డిస్మ్‌స్ కానివ్వలేదని ఏ ఐటియుసి హాయాంలో డిస్మిస్ అయిన 450 కార్మికులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగిందని అన్నారు.కార్మికుల సౌకర్యకోసం లైట్‌వేట్ క్యాప్‌ల్యాంప్, యూనిఫాం,కార్పోరెట్ వైధ్యం, పదోన్నతులు, 5500 కొత్త ఉద్యోగాలు సాధించుకున్నామని అన్నారు. సింగరేణిలో ఏ ఓక్క హక్కును పోగొట్టకుండా గత ఎన్నికల్లో ఇచ్చిన హక్కులను దాదాపు సాధించామని కావున భవిష్యత్లులో కార్మిక హక్కులు సాదించాలంటే కెసి ఆర్ ద్వారనే సాద్యమని, టిబిజికె ఎస్ అధిక మెజార్టితో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో ఎన్నికల సభ్యులు బంటు సారయ్య, బండి రమేష్, మహిపాల్‌రెడ్డి, కలిందర్ ఆలీఖాన్,రాయమల్లు, ఫిట్ కార్యదర్శి కొలిపాక సమ్మయ్య,కొమురయ్య, లింగయ్య,తిరుపతి,జక్కులరాజేశం తదితరలు పాల్గొన్నారు.

హక్కులను తాకుట్టు పెట్టిన సంఘాలను ఓడించండి
* హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్
శ్రీరాంపూర్ రూరల్, సెప్టెంబర్ 22: సింగరేణిలో కార్మిక హక్కులను యాజమాన్యనికి తాకట్టుపెట్టిన సంఘాలను చిత్తుగా ఓడించాలని హెచ్ ఎం ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. ఏరియాలోని ఆర్కె న్యూటెక్ గని ద్వార సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వాధంతోగెలుపొందిన టిబిజికెఎస్ కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. డబ్బుల పంచాయతీలతోకాలం వెల్లదీసారని ఆరోపించారు. జెబిసిసిఐ సమావేశంలో స్థానంలేని టిబిజికెఎస్‌కు ప్రభుత్వం అండతప్ప యూనియన్ స్వతాగా సాధించింది ఏమిటో కార్మికులకు చెప్పాలన్నారు. ఎంపి, ఎమ్మెల్యేలు మంత్రుల పేర్లు చెప్పుకునే సంఘాలు జెబిసిసిఐ లో కార్మిక హక్కులు ఎలా సాధిస్తారని అన్నారు. కార్మిక హక్కులకోసం పోరాడని సంఘం నాయకులు సీతారామయ్య, ఐఎన్‌టియుసి,టి ఎన్‌టియుసి, వైసిపి పార్టిలతో పొత్తుపెట్టెకున్నా కార్మికులు చిత్తుగా ఓడించడం కాయమని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా హెచ్‌ఎంఎస్ గెలుపు కాయమన్నారు. కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి ఆశోక్ రెడ్డి తిప్పని మల్లయ్య,కార్యదర్శి తిరుపతి గౌడ్, సారయ్య ,వినయ్ కుమార్,సదయ్య, లింగంపల్లి శంకర్,బుచ్చయ్య, నూనేటిశ్రీను తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించాలి
* కరీంనగర్ రేంజ్ డిఐజి రవివర్మ
దివ్యనగర్, సెప్టెంబర్ 22: నిర్మల్ జిల్లా ప్రజలకు పోలీసులు నాణ్యమైన పోలీసు వ్యవస్థను అందించి పోలీసుల గౌరవం మరింత పెంచేవిధంగా కృషిచేయాలని కరీంనగర్ రేంజ్ డి ఐజి సి.రవివర్మ తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి నిర్మల్ రూరల్ పోలీసు కార్యాలయం, భైంసా పట్టణ పోలీస్‌స్టేషన్‌లను తనిఖీచేసి పోలీసులతో మాట్లాడారు. నేరాలను అరికట్టుటకు ఫ్రెండ్లీ పోలిసింగ్ అవలంభించాలని పలు సూచనలుచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లవేలల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా స్టేషన్లలో రికార్డులను పరిశీలించి శాంతిభద్రతలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో నిర్మల్, భైంసా డి ఎస్పీలు మనోహర్‌రెడ్డి, అందెరాములు, నిర్మల్ గ్రామీణ, భైంసా పట్టణ సి ఐ లు జీవన్‌రెడ్డి, రఘు, ఎస్సైలు తిరుపతి, పున్నంచంద్, నజీర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

లక్కు .... కిక్కు
* మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా ఎంపిక
* మద్యం దుకాణాల లైసెన్స్ పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మద్యం దుకాణాల పాలసి ఎట్టకేలకు మద్యం వ్యాపారుల కిక్కుదిగింది. మద్యం దుకాణాల కోసం సెప్టెంబర్ 13 నుండి 19 వరకు ఎక్సైజ్ శాఖ టెండర్ల ద్వారా 69 షాపులకు 822 దరఖాస్తులు స్వీకరించారు. లక్కి డ్రా పద్దతి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మద్యం వ్యాపారుల ఆశలు శుక్రవారం గల్లంతయ్యాయి. లక్కున్నోడిదే కిక్కు అన్నట్లుగా మద్యం వ్యాపారస్తులు కొన్ని గంటలుగా లక్కి డ్రా వద్ద ఎదురుచుశారు.మంచిర్యాల జిల్లాలో 69 మద్యం షాపులలో రెండు మద్యం షాపులకు ఒకే దరఖాస్తు రావడంతో వారికే లైసెన్స్ అందజేశారు.శుక్రవారం పట్టణంలోని పద్మావతి గార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రియాంక, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్సింహా రెడ్డి ల ఆద్వర్యంలో లక్కి డ్రాలో మద్యం దుకాణం దక్కించుకున్న వారికి అనుమతి పత్రాలను అందజేశారు. గెజిట్ నోటీఫికేషన్ ప్రకారం 67 షాపులకు గాను డ్రా పద్దతి ద్వారా షాపులను కేటాయించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండామద్యం దుకానాల కేటాయింపు ప్రశాంతంగా ముగిసిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి అన్నారు. కొత్తగామద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు సుప్రీం కోర్టు విదించిన నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. అక్టోబర్ 1 నుండి కొత్త మద్య పాలసీని ప్రకటించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని ఎక్సైజ్ శాఖ అధికారి నర్సింహారెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలను మినహాయించి నేషనల్ హైవే పై, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలను నిబంధనలకు అనుగూనంగా 200ల మీటర్ల నుండి 500ల మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకునేలా ముందే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.