అదిలాబాద్

ఎసిబిలో వలలో రెబ్బెన తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్, సెప్టెంబర్ 23: కుమ్రభీం జిల్లా రెబ్బెన మండల తహశీల్దార్ బి.రమేష్‌గౌడ్‌ను కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డిఎస్సీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం వలపన్ని పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రెబ్బెన మండలం దేవులగూడకు చెందిన ఎలమంచిలి సునీల్‌చౌదరి హైదరాబాద్‌కు చెందిన దండనాయకుల నారాయణరావు దగ్గర గత సంవత్సరం ఫిబ్రవరిలో 9 ఎకరాలు భూమి కొనగోలు చేశారు. సునీల్ చౌదరి కొనుగోలు చేసిన భూమి మ్యూటేషన్ కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. మొదటి చేసుకున్న దరఖాస్తును తహశీల్దార్ తిరస్కరించాడు. మళ్లీ కొద్దిరోజుల తర్వాత సునీల్‌చౌదరి తన పేర మీద నాలుగున్నర ఎకరాలు భూమి, తల్లి సామ్రాజ్యం పేరు మీద నాలుగున్నర ఎకరాలు భూమి మ్యూటేషన్ కోసం తహశీల్దార్ కార్యాలయంలో రెండోసారి దరఖాస్తు చేసుకున్నాడు. రూ.5లక్షలు రూపాయలు లంచం ఇస్తేనే మ్యూటేషన్ చేస్తానని చౌదరికి తహశీల్దార్ తెలిపాడు. తహశీల్దార్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్న మండలంలోని పులికుంటకు చెందిన చింతపూరి శంకర్‌ను సునీల్ చౌదరి సంప్రదించాడు. శంకర్‌ను సునీల్‌చౌదరి వెంట పెట్టుకుని ఈనెల 21న కాగజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న తహశీల్దార్ రమేష్‌గౌడ్ ఇంటికివెళ్లి మంతనాలు చేశారు. రూ.5లక్షలు రూపాయలు ఇవ్వలేనని, రూ.3.50లక్షలు ఇస్తానని చౌదరి ఒప్పుకున్నాడు. దీనిపై సునీల్ చౌదరి ఎసిబి అధికారులను సంప్రదించాడు. దీంతో శనివారం సునీల్‌చౌదరి రూ.2లక్షలు ఇస్తానని తహశీల్దార్ రమేష్‌గౌడ్‌కు ఫోన్ చేయగా చింతపూరి శంకర్‌ను పంపిస్తానని అతనికి ఇవ్వాలని సూచించారు. తహశీల్దార్‌ను పట్టుకునేందుకు ఎసిబి అధికారులు బృందాలుగా వీడిపోయి మాటు వేశారు. సునీల్‌చౌదరి నుండి శంకర్ రూ.2లక్షలు తీసుకొని తహశీల్దార్‌కు ఫోన్ చేశాడు. వెంటనే ఎసిబి అధికారులు శంకర్‌ను అదుపులోని తీసుకొని అతని వద్ద నుండి రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలో భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో ఉన్న తహశీల్దార్‌ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకొని రైతు సునీల్ చౌదరి ఇంటికి తీసుకుని వచ్చి విచారణ చేశారు. అనంతరం ఎసిబి అధికారులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 8గంటల వరకూ ఎసిబి అధికారులు రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రమేష్‌గౌడ్ మాట్లాడుతూ తాను సునీల్‌చౌదరి నుండి ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని, కావాలనే కొందరు కుట్రపన్ని లంచం కేసులో తనను అక్రమంగా ఇరికించారని తెలిపారు. ఈ దాడిలో ఎసిబి సిఐలు కాశయ్య, వెంకటేశ్వర్లు, వీరభద్రం, వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. తహశీల్దార్ రమేష్‌గౌడ్‌ను ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు దావానలంగా వ్యాపించడంతో నాయకులు, ప్రజలు రెవెన్యూ కార్యాలయానికి పెద్దఎత్తున చేరుకున్నారు.