అదిలాబాద్

ప్రజా సమస్యల పరిష్కారంలోనిర్లక్ష్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, అక్టోబర్ 16: ప్రజాసమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం డిపిఓ కార్యాయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో ఎస్పీ పాల్గొని అర్జీలు స్వీకరించారు. సమస్యల నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. అధికారులే స్వయంగా ఫిర్యాదుల స్వీకిరించి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజాఫిర్యాదుల విభాగంలో 12 దరఖాస్తులు అందాయి. ఆక్రమణకు గురైన తన భూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని అల్లూరి శాంతాబాయి కోరారు. అనుమానితునిగా తనపై నమోదైన కేసును తొలగించి చదువుకు సహకరించాలని కాగజ్‌నగర్‌కు చెందిన మెరుగు రాజేష్ ఎస్పీని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఎస్పీ సిసి దుర్గం శ్రీనివాస్, ఎస్‌బి సిఐ సుధాకర్, ఎస్‌బి ఎస్ ఐలు శివకుమార్, శ్యాంసుందర్, డిసిఆర్‌బి ఎస్‌ఐ రాణాప్రతాప్, అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రహ్లాద్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్, ఫిర్యాదుల విభాగం అధికారిణి సునీత, పిఆర్‌ఓ మనోహర్ పాల్గొన్నారు.

పిడుగుపాటు బాధితులను ఆదుకుంటాం
* మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దివ్యనగర్, అక్టోబర్ 16: వ్యవసాయ పనులుచేస్తూ పిడుగుపాటుకు గురై మృతిచెందిన ఇద్దరు బాధితుల కుటుంబ సభ్యులను అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సోన్ మండలంలోని బొప్పారం గ్రామంలో పిడుగుపాటుకు గురై మృతిచెందిన ఒడ్నాల నర్సవ్వ, రాచర్లదేవాయి మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం మంత్రి బొప్పారం గ్రామానికి వెళ్లి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. పిడుగుపాటు పడిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 5వేల చొప్పున మంత్రి ఆర్థిక సహాయం అందజేశారు. మంత్రివెంట సర్పంచ్ భూమారెడ్డి, మాజీ ఎంపిటిసి రాంరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు రమేష్, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
మృతిచెందిన వారి అంత్యక్రియలు
పిడుగుపాటుకు గురై మృతిచెందిన ఇద్దరు మహిళల అంత్యక్రియలు సోమవారం బొప్పారం గ్రామంలో నిర్వహించారు. ఆదివారం మృతిచెందినప్పటికి పోస్టుమార్టం కావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలు సోమవారం చేశారు. గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం తెలిపారు.