అదిలాబాద్

వృత్తి శిక్షణ కోర్సులతో స్వయం ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్ అక్టోబర్ 17: వృత్తి శిక్షణ కోర్సులతో స్వయం ఉపాధి పొందుతు మహిళలు ఆర్థికంగా ఎదగాలని సింగరేణి సేవా అధ్యక్షురాలు ఆస్మాసుభానీ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం వద్ద సేవాభవన్ నందు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. శ్రీరాంపూర్ ఏరియాలో అనేక వృత్తి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు నేర్చుకున్న మహిళలు సొంత యూనిట్లు పెట్టుకొని ఆర్థికంగా లాభం పొందుతూ, ఇదే కోర్సులను ఇతరులకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. మార్కెట్‌లో కుట్టు శిక్షణలోతర్ఫీదు పొందిన వారికి ప్రామూఖ్యత చాలా ఉందన్నారు. కావున ప్రతి ఓక్కరు సింగరేణి ఏర్పాటు చేసిన వృత్తి శిక్షణ కోర్సులలో చేరి శిక్షణ పొందాలని కోరారు. కార్యక్రమంలో డివైపిఎం అజ్మీర తుకారాం, సేవా కార్యకర్తలు రత్నకళ, కోట్టె జ్యోతి, రజిత,శంకరమ్మ, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి
కాగజ్‌నగర్, అక్టోబర్ 17 ; గత ఐదునెలలుగా తమకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఈ ఎస్ ఐ, పి ఎఫ్ లను తమ ఖాతాల్లో జమ చేయాలని,కాంట్రాక్ట్ వ్యవస్తను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆద్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి కి మున్సిపల్ కార్మికులు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమయానికి వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉందని, కుటుంబాలు గడవలేని పరిస్థితి ఉందని వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. వేతనాలు చెల్లించని పక్ష్యంలో దీపావళి నుండి నిరసనలు తెలుపుతామని, ఈ నెల 25 నుండి ఎప్పుడైనా సమ్మె బాట పడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు శంకర్, సంజీవ్ లతో పాటు కార్మికులు ఉన్నారు.