అదిలాబాద్

ఇంటింటికీ తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 17: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకం ద్వారా త్వరలోనే ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.మంగళవారం నిర్మల్ మండలంలోని మంజులాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ కింద చేపడుతున్న ఇంట్రావిలేజ్ పనులను మంత్రి పరిశీలించారు. గ్రామంలోని పలుకాలనీల్లో తిరుగుతూ నల్లా కనెక్షన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలోని సారంగాపూర్, దిలావర్‌పూర్ మండలాల్లో ఇప్పటికే పనులన్నీ పూర్తికాగా, మిగతా మండలాల్లో చురుగ్గా సాగుతున్నాయన్నారు. వచ్చేనెల 15 నాటికి ఇంట్రావిలేజ్ పనులు పూర్తిచేసి గ్రామీణ ప్రాంతాల్లోని 42 వేల ఇండ్లకు ఇంటింటికీ నల్లా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలోని ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తవుతాయన్నారు. పథకాన్ని ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, గడువులోగా మిషన్ భగీరథ, ఇంట్రావిలేజ్ పైప్‌లైన్, ఇంటింటికీ నల్లా కనెక్షన్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద నిర్మిస్తున్న ఓహెచ్ ఎస్‌ఆర్‌ల నిర్మాణం, ఇంట్రావిలేజ్ పనులు పూర్తిచేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. మిషన్ భగీరథ కింద ఇంట్రావిలేజ్ పనులను పూ ర్తిచేసి ప్రతీ ఇంటికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం ముందుకు వెళ్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1026 కిలోమీటర్ల పైప్‌లైన్‌లను రూ. 161.28 కోట్లతో చేప ట్టి 671 ఆవాసాల్లోని లక్షా 35 వేల 397 ఇళ్లకు తాగునీటిని అం దించబోతున్నామన్నారు. నిర్మల్ నియోజకవర్గానికి ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి ముధోల్ నియోజకవర్గానికి గడ్డెన్నవాగు నుండి, ఖానాపూర్ నియోజకవర్గానికి కడెం ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందించనున్నామన్నారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజెందర్,పిఎసిఎస్ చైర్మన్‌లు రామేశ్వర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎంపిటిసి అ యిండ్ల పోశెట్టి, సర్పంచ్ చెనిగారపు నరేష్, ఆర్‌డబ్ల్యు ఎస్ ఈఈ దేవేందర్‌రెడ్డి, డిఈ కె.శ్రీనివాస్, ఎఈ వినోద్, టిఆర్‌ఎస్ నేతలు పాకాల రాంచందర్, పాల్గొన్నారు.
అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం
* రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ పట్టణ అధ్యక్షుడు గజెల్లి
బెల్లంపల్లి, అక్టోబర్ 17 : పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని తెలంగాణ సీనియర్ సిటిజన్స్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని బజార్ ఏరియా క్లబ్ స్కూల్ ఆవరణంలో పోలీసు అమర వీరుల స్పూపం చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడుట కోసం తమ వృత్తి ధర్నాన్ని నిర్వర్థించడం కోసం 24 గంటలు శాంతి భదత్రల పరిరక్షణ కోసం నెలల తరబడి తమ కుటుంబానికి దూరంగా ఉంటూ విధి నిర్వాహనలో సంఘవిద్రోహ శక్తులను నిర్మూలించే క్రమంలో తమ ప్రాణాలను సైతం ప్రజల కోసం పోలీసులు అర్పించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల పని తీరు దేశానికే ఆదర్శం అన్నారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ, నాయకులు రాజమల్లు, కీర్తినర్సింహారావు, అంజయ్య, రాజనర్సు, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.