అదిలాబాద్

పత్తి, సోయా పంటలకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుభీర్, అక్టోబర్ 17: మండలంలో చేతికి వస్తున్న పత్తి, సోయా పంటలకు పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్రనష్టం జరిగింది. అయతే సోయాలో అంతరపంటగా సాగైన కంది పంట కు మంచి చేసిందని రైతులు అంటున్నారు. పంటలు పెరుగుదల సమయంలోనే వర్షాలు మొఖం చాటేశాయి. దీంతో ఇతర పంటలతో పాటుగా కంది పెరుగుదల ఆగిపోయింది. కానీ ప్రస్తు తం కురుస్తున్న వానలకు కంది పంట ఆశాజనకంగా పెరిగింది. కంది దిగుబడులు కూడా భూమిలో తేమ ఉండడం వల్ల పెరుగుతాయన్న ఉత్సాహంలో రైతన్నలున్నారు. మండలంలో కంది,పత్తి, సోయా, మినుము తదితర పంటల్లో అంతరపంటగా 2822 హెక్టార్లలో సాగైంది. చేతికి వచ్చిన పత్తిని తీయాలన్న... వర్షాలు కురుస్తుండడంతో ఏరేందుకు సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం రాలిపోతున్నది. ఏ మాత్రం సమయం దొరికినా పత్తి కూలీలకోసం రైతులు వెతుకుతున్నారు. మండలంలో 27.350 హెక్టార్లలో పత్తి సాగైంది.
ఉపాధ్యాయులను వేధించొద్దు
* ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధయ్య
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 17 ; కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ సెలవుల్లో ఉపాద్యాయులను వేదింపులకు గురి చేస్తున్నాయని ట్రస్మారాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధయ్య అన్నారు. మంగళవారం కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ విద్యార్థి సంఘ నాయకులుగా చెప్పుకునే కొంత మంది కేవలం వ్యక్తి గత ప్రయోజనాల కోసం తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయన్నారు. సెలవుల్లో పాఠశాలలు నిర్వహించి వివిధ రకాల ప్రైవేటు, నైట్ క్లాసుల పేరుతో ఉపాద్యాయులను మనోవేదనకు గురి చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థపై అవగాహన లేని విద్యార్థి సంఘ నాయకులు పాఠశాలల యాజమాన్యాన్ని, అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు ఒడ్నాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి పద్మాచరణ్, కోశాధికారి రాంవేణు, సంఘం సభ్యులు భువనేశ్వరి, ఉస్మాన్ పాషా, శ్రీనివాస్, పున్నం, తదితరులు పాల్గొన్నారు.
కిక్ బాక్సింగ్ పోటీల్లో విద్యార్థి ఉత్తమ ప్రతిభ
ముధోల్, అక్టోబర్ 17: నియోజకవర్గ కేంద్రంలోని అక్షర పాఠశాలకు చెందిన బి. జ్ఞానేశ్వర్ అనే విద్యార్థి ఇటీవలే నిర్వహించిన జోనల్ ( నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్) స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. 14,17, 19 విభాగాల్లో కిక్ బాక్సింగ్ పోటీల్లో పాఠశాలలో ఆరవ తరగతిలో చదవుతున్న జ్ఞానేశ్వర్ అనే విద్యార్థి జోనల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైయ్యాడు. మంగళవారం విద్యార్థికి పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సుభాష్ పటేల్, కరస్పాండెంట్ రమేష్, ప్రధానోపాధ్యాయులు సాయికుమార్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.