అదిలాబాద్

బాసరలో బిజెపి నేత మురళీధర్‌రావు పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర,అక్టోబర్ 17: బాసర అమ్మవారి సన్నిధిలో మంగళవారం బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిచెంత బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావుచే ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించారు. అనంతరం అర్చకులు హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆలయ చరిత్ర, విశిష్టతను ఆయనకు వివరించారు. పట్టువస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరివెంట నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, జిల్లా ప్రధానకార్యదర్శి బి.సతీశ్వర్‌రావు, స్తానిక బిజెపి నాయకులు ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
చలో కేరళ పోస్టర్ విడుదల
నిర్మల్, అక్టోబర్ 17: అఖిల భారతీయ విద్యార్థిపరిషత్ నిర్మల్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చలో కేరళ పోస్టర్లను విడుదల చేశారు. స్తానిక బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎబివిపి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సంఘటన కార్యదర్శి రాజేష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎబివిపి జెండాను పట్టినందుకు, భారత్‌మాతాకు జై అన్నందుకు కేరళలో మార్క్సిస్ట్ నరహంతకుల చేతిలో దారుణంగా చంపబడ్డ ఎబివిపి యువకిశోరాలు అనూ, సుజిత్, కరుణకరన్‌ల ఆత్మశాంతికోసం ఈ కేరళయాత్రను చేపట్టినట్లు తెలిపారు. న్యాయం దక్కనిపీడితుల పక్షాన అన్యాయమైన వారి కుటుంబాల పక్షాన జాతీయవాదులపై జరిగే మారణహోమాన్ని ప్రశ్నించడానికి ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. కేరళ మేలను పట్టివేలాడుతున్న కమ్యూనిస్టు కపట వృక్షాన్ని పెకిలించివేయడానికి ఒక్కొక్కరుగా కదిలి లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. నిర్మల్ నగర సంఘటన కార్యదర్శి రాజేష్ రాథోడ్, కార్యాలయ కార్యదర్శి విజయ్‌గౌడ్, కార్తీక్‌తేజ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎఐఎస్‌ఎఫ్ సభ్యత్వ నమోదు
తాండూర్, అక్టోబర్ 17: తాండూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మంగళవారం ఎఐఎస్‌ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యరంగ సమస్యలు పరిష్కారంలో ఎఐఎస్‌ఎఫ్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఎఐఎస్‌ఎఫ్ సభ్యత్వం స్వీకరించారు. ఎఐఎస్‌ఎఫ్ బెల్లంపల్లి నియోజక వర్గం ఇన్‌చార్జి రాంపెల్లి రాజశేఖర్, నాయకులు మహేందర్, సాయికిరణ్ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
భీమిని, అక్టోబర్ 17 : ఈ నెల 12వ తేదీన గోలేటిలో జరిగిన టాగ్ ఆఫ్ వార్ జోనల్‌స్థాయి పోటీల్లో కనె్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో జరిగే టాగ్ ఆఫ్ వార్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాద్యాయుడు చందు, పిడి చాంద్ పాషాలు తెలిపారు. అండర్ 14 బాలికల విభాగంలో ఎన్.మీన, ఎస్. వనిత, అండర్ 14 బాలుర విభాగంలో రాజు, రాజ్‌వీర్, అండర్ 15 బాలుర విభాగంలో ఎన్. రాజన్న ఎంపికైనట్లు ఆయన తెలిపారు. 13వ తేదీన తాండూల్‌లో జరిగిన త్రోబాల్ జోనల్ స్థాయి పోటీల్లో అండర్ 14 బాలికల విభాగంలో సిహెచ్ చిన్నుబాయ్, అండర్ 14 బాలుర విభాగంలో జి. శ్రీనివాస్, పి. పవన్ ఎంపికయ్యారని వీరందరు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
భూ రికార్డుల ప్రక్షాళనతో రైతులకు మేలు
* బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య
తాండూర్, అక్టోబర్ 17 : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన రైతులకు ఎంతో మేలు చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని రేచిని గ్రామ పంచాయతి కార్యాలయంలో మంగళవారం భూ రికార్డు ప్రక్షాళన సర్వేపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ రికార్డు ప్రక్షాళన సర్వేతో రైతులకు ఎంతో ప్రయోజనం కల్గుతుందన్నారు. సర్వేను రైతులు సద్వినియెగం చేసుకొని భూ రికార్డులు సరి చేసుకోవాలని సూచించారు. రైతాంగం సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అహర్శిశలు కృషి చేస్తున్నరన్నారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని సిఎం కెసిఆర్ మూడున్నర ఏళ్లలోనే తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని, రాబోయే రోజుల్లో అడ్రస్సు గల్లంతు కావడం ఖాయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే పలువురు లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి మాసాడి శ్రీదేవి, జడ్పీటీసీ మంగపతి సురేష్, సర్పంచ్ బుట్ట మంగ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.నర్సింగం, ఎంపిటిసి సుబ్బ దత్తుమూర్తి, బెల్లంపల్లి ఎంపిపి సుభాష్‌రావు, ఆర్డివో వీరన్న, తహసీల్దార్ రాంచంద్రయ్య, పశువైద్యాధికారి నర్సింహరావు, నాయకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పై ఆరోపణలు అవాస్తవం
తిర్యాణి, అక్టోబర్ 17 : ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పూరాణం సతీష్ ఆదివాసీలను గొర్రెలుగా అభివర్ణించాడంటు వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తిర్యాణి జడ్పీటీసీ వెడమ కమళ పేర్కొన్నారు. మంగళవారం తిర్యాణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ పురాణం సతీష్ గిరిజన అభివృద్దికి ఎంతో సహకరింస్తు వస్తున్నాడని అన్ని మారుమూల గ్రామాలను సందర్శించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అలాంటి ఎమ్మెల్సీ పురాణం సతీష్‌పై మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అసత్యపు ఆరోపణలు చేయడం తగదన్నారు. తెరాసా ప్రభుత్వం గిరిజన అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు రత్నుబాయ్, లక్ష్మన్, గోపాల్, ఎంపిటిసి యశ్వంత్ రావు, జిల్లా రైతు సమన్వయ కమిటి సభ్యులు మడావి డిందర్శ, నాయకులు భవంత్ రావు,గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ దగ్ధం.. సరైంది కాదు
మందమర్రి, అక్టోబర్ 17 ; విద్యా సంఘాల నాయకులు డి ఈవో దిష్టి బొమ్మను దగ్దం చేయడం సరైంది కాదని ట్రస్మ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్తానిక ప్రేస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంఘాల నాయకులు ప్రైవేటు పాఠశాలపై కావాలని ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించుకుని గత శని పాఠశాలలను నడిపించడం జరిగిందని దాన్ని రాద్దాంతం చేసి ప్రైవేటు పాఠశాలలపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ప్రైవేటు పాఠశాలల సంఘం నాయకులు శ్రీనివాస్, రాంరెడ్డి, వేణు,తదితరులు పాల్గొన్నారు.
వివాహిత పై గొడ్డలితో దాడి
కాగజ్‌నగర్, అక్టోబర్ 17 ; కాగజ్‌నగర్ మండలం సారిగాం గ్రామంలో మంగళవారం వివాహితపై గొడ్డలితో దాడి జరిగింది. గ్రామానికి చెందిన రామయ్య తమ బావమరిది భార్య నికోడె గంగూబాయ్ పై వ్యక్తి గత కక్షలతో దాడి చేసి గాయపరిచారు. గ్రామంలోని ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాదితురాళిని పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.