అదిలాబాద్

దండారి వేడుకల్లో రామన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 20: దీపావళి పండగ సంబరాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అంబరాన్ని అంటా యి. గిరిజన సంప్రదాయాలు, పొరు గు మహారాష్ట్ర ఆచారాలు ఉట్టిపడేలా గురు, శుక్రవారాల్లో మహాలక్ష్మీ పూజ తోపాటు దీపావళి ఉత్సవాలను ప్రజలు కన్నుల పండవగా నిర్వహించారు. గిరిజన గూడేల్లో దండారి నృత్యాలు గుస్సాడీ సంబరాలతో పల్లె లు సందడి చేశాయి. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రి జోగు రామన్న సైతం ఆదిలాబాద్‌లో దీపావళి వేడుకల్లో ఆనందోత్సవాలతో పాల్గొన్నారు. మంత్రి నివాస ఎదుట వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజనులు గుస్సాడీ వేషాధారణతో దండారి నృత్యాలు నిర్వహించి అందరిని అలరింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న సైతం గుస్సాడి తలపాగ ధరించి వారితో కలిసి నృత్యం చేశారు. అనంతరం వారికి సంప్రదాయబద్ధం గా మర్యాదలు నిర్వహించి, కానుకలతో సాగనంపారు. ఇదిలా ఉంటే, జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ పట్టణంలో దీపావళి పర్వదినం సందర్భం గా చిన్నపెద్ద తేడాలేకుండా కుటుంబ సమేతంగా టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాత్రివేళ రంగు రంగుల మిరుమిట్లు గొలిపే రీతిలో బాణాసంచా కాల్చడం తో పట్టణంలో దివ్యకాంతులతో వెలిగిపోయింది. కాగా, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు గుస్సాడీ దండారి ఉత్సవాలను శుక్రవారం ముగించారు. ఇదిలాఉంటే, శుక్రవారం కార్తీకమాసం ప్రారంభంకావడంతో జిల్లా అంతటా కార్తీదీపోత్సవ కార్యక్రమాలు వేడుకగా జరగనున్నాయి. బాసరలో భక్తులు పోటెత్తారు. అదేవిధంగా గూడెం గుట్ట వద్ద సైతం భక్తుల రద్ధీ కనిపించింది. నిర్వహించి, కానుకలతో సాగనంపారు. ఇదిలా ఉంటే, జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ పట్టణంలో దీపావళి పర్వదినం సందర్భం గా చిన్నపెద్ద తేడాలేకుండా కుటుంబ సమేతంగా టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాత్రివేళ రంగు రంగుల మిరుమిట్లు గొలిపే రీతిలో బాణాసంచా కాల్చడం తో పట్టణంలో దివ్యకాంతులతో వెలిగిపోయింది. కాగా, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు గుస్సాడీ దండారి ఉత్సవాలను శుక్రవారం ముగించారు. ఇదిలాఉంటే, శుక్రవారం కార్తీకమాసం ప్రారంభంకావడంతో జిల్లా అంతటా కార్తీదీపోత్సవ కార్యక్రమాలు వేడుకగా జరగనున్నాయి. బాసరలో భక్తులు పోటెత్తారు. అదేవిధంగా గూడెం గుట్ట వద్ద సైతం భక్తుల రద్ధీ కనిపించింది.