అదిలాబాద్

టిఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోథ్, అక్టోబర్ 22: బంగారు తెలంగాణ లక్ష్య సాధనకై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మండలంలోని నిగిని గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నిగిని గ్రామ శివారులో అంతరాష్ట్ర సరిహద్దులో గల కైలాస్ టెకిడి శివాలయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ కైలాస్ టెకిడి అభివృద్ధికి 1.5 కి.మీటర్ల పరిధిలో ఉన్న అటవీ శాఖకు సంబంధించిన రోడ్డు క్లియరెన్స్‌ను త్వరలో పూర్తిచేస్తామని, రోడ్డు నిర్మాణానికి కృషిచేస్తామన్నారు. రాబోయే మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం చేపడుతామని, అన్ని అనుమతులను ప్రభుత్వం తరుపున మంజూరు చేస్తామన్నారు. అలాగే నిగిని సరిహద్దుదలోని 300 ఎకరాల భూమిని అబ్దుల్ మోహినొద్దిన్ పేరునా ఉందని, దాని పట్టాదారులు నిగిని గ్రామస్తులు ఉన్నారని, ఎవరైతే పట్టాదారులు వ్యవసాయ భూమి సాగుచేస్తున్నారో వారిపేరునే పట్టాలు జారీచేస్తామన్నారు. నిగిని, మర్లపెల్లి లింకురోడ్డుతోపాటు 24గంటల కరెంట్ అందిస్తామని మంత్రి హమీఇచ్చారు. అంతకు ముందు పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ మాట్లాడుతూ నిగిని నుండి కైలాస్ టెకిడి శివాలయంవరకు రోడ్డు నిర్మాణంకోసం ఎన్‌ఆర్‌ఈజిఎస్ పథకం కింద రూ.50లక్షలు మంజూరు చేశామని, ఈ నిధులతో త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ కెసి ఆర్ సారథ్యంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని అన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ బోథ్ మండలంలోని నిగిని గ్రామాభివృద్దికై ఇప్పటికే రూ.4కోట్ల 41లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని, వీటికి సంబంధించిన అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిగిని గ్రామ సరిహద్దులోని చెరువు నిర్మాణంకోసం రూ.8కోట్ల 25లక్షల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి చెరువు నిర్మాణం చేపడుతామన్నారు. అలాగే దేవాలయ శాఖ అధ్వర్యంలో కైలాస్ టెకిడి శివాలయం నిర్మాణం కోసం రూ.15లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నిధులతో త్వరలోనే కైలాస్ టెకిడి శివాలయ నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. అలాగే నిగిని గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని పురాతన అంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధుల నుండి రూ.10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కొన్ని దశాబ్దాలుగా వెనకబడిన ఉన్న బోథ్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందిందని, దీనికి కారణం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే కారణమన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, ఆసరా, డబుల్‌బెడ్‌రూం, డ్వాక్రా మహిళల రుణాల పంపిణీ, మిషన్ కాకతీ, మిషన్ భగీరథ వంటి పథకాలు విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుమారు వంద ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి జోగు రామన్న సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనోహర్, మాజీ ఎంపి రాథోడ్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మెన్ శారద రెడ్డి, ఎంపిపి గంగుల లక్ష్మి, జడ్పీటీసీ బండారు సాయమ్మ, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆడె శీల, మాజీ మార్కెట్ చైర్మెన్ తుల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ రుక్మాణ్‌సింగ్, నిగిని గ్రామ సర్పంచ్ పూర్ణబాయి, ఎఫ్‌ఆర్‌వో మనోహర్, డిప్యూటి ఎఫ్ ఆర్‌వో వీరయ్య, ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.