అదిలాబాద్

టెన్త్ విద్యార్థులపై శ్రద్ధ చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, అక్టోబర్ 22: వివిధ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఐటిడిఏ చైర్మన్, కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అన్నారు. శనివారంరాత్రి ఐటిడిఏ పివో క్యాంపు కార్యాలయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్‌తో కలిసి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిడిఎ ద్వారా విద్య, వైద్య సంక్షేమ పథకాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఐటిడిఎ పరిధిలోని పదవ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్దకనబర్చి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. పదవ తరగతి పరీక్షలకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా మెరుగైన విద్యాబోధనకు నవంబర్ నుండి వంద రోజుల పాటు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. వీటిపై ఏటిడబ్ల్యూవో, డిజిడివోలు పర్యవేక్షించాలన్నారు. వారానికి ఒకరోజు మారుమూల ప్రాంతాల్లో బస చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం ద్వారా 102 ఆశ్రమ పాఠశాలల భవనాల మరమ్మత్తులు, శుద్దజలం నీటి ప్లాంట్, సోలార్ ప్లాంట్ల మరమ్మత్తులు చేపడుతున్నామన్నారు. ఏజెన్సీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మారుమూల గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలంతో పాటు వైద్యశిబిరాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా గిరిజన మహిళా సంఘాలు ఏర్పాటు చేసి స్ర్తినిధి ద్వారా వారికి అభివృద్ది ఫలాలు అందే విధంగా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చ్భారత్ పకోడ కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయిలో అమలయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ గోపి, ఆర్డీవో విద్యాసాగర్, డిటిడబ్ల్యూవో పోశం, జిల్లా వైద్యాధికారి రాజీవ్‌రాజ్, ఉమ్మడి జిల్లాల అధికారులు, ఏపివో జనరల్ కుమ్ర నాగోరావు, పరిపాలన అధికారి పెందూర్ భీం తదితరులు పాల్గొన్నారు.