అదిలాబాద్

పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో ప్రతిభచాటి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అన్నారు. ఆదివారం ద్వరాక నగర్‌లోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బిసి స్టడీ సర్కిల్ పనితీరును ఆకస్మికంగా సందర్శించారు. పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థుల నైపుణ్యాన్ని ఆరా తీశారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో నిరుద్యోగుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో నెగ్గాలని సూచించారు. ముఖ్యంగా ట్యూటర్లు అందించే కోచింగ్ వివరాలను, విద్యార్థుల సంఖ్యను, అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలపై స్టడి సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. పాఠ్యాంశాలు, గ్రంథాలయంలోని పుస్తకాలు, పత్రికల గురించి ఆరా తీశారు. స్టడి సర్కిల్‌లో తరగతి గదులు విశాలంగా ఉండాలని, మానసిక ప్రశాంతతో విద్యార్థులు ఏకగ్రతతో చదువుకోవాలని సూచించారు. అయితే ఇక్కడి బిసి స్టడి సర్కిల్ ఇరుకు గదుల్లో పనిచేయడం పట్ల కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశాలమైన గదులు ఉండేలా చూడాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట బిసి సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, తహసీల్దార్ వర్ణ, ఎంపిడీవో రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

కొండపల్లి వృక్ష శిలాజాల కోసం పరిశోధన కేంద్రం ఏర్పాటు
* జిల్లా కలెక్టర్ చంపాలాల్
బెజ్జూర్, అక్టోబర్ 22: పెంచికల్‌పేట మండలంలోని కొండపల్లి అటవీ ప్రాంతంలోని వృక్ష శిలాజాలను గుర్తించి పరిశోధన కేంద్రంగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కుంమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ తెలిపారు. ఆదివారం పెంచికల్‌పేట మండలంలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో గల వృక్ష శిలాజాలను ఆయన సందర్శించి మాట్లాడారు. వృక్ష శిలాజాలను 2015 సంవత్సరంలో బెజ్జూర్ అటవీ శాఖ అధికారులు గుర్తించినట్లు ఆయన తెలిపారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో 11 హెక్టార్లలో ఈ వృక్ష శిలాజాలు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ శిలాజాలను పరిశీలించేందుకు పరిశోధన కేంద్రం కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పురాత వృక్ష శిలాజాలు ఈ ప్రాంతంలో ఉండటం అభివృద్దికి శుభసూచకం అని అన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, కాగజ్‌నగర్ ఆర్డీవో రమేష్ బాబు, తహసిల్దార్ రియాజ్ అలీ, స్థానిక సర్పంచ్ సుధాకర్, సెక్షన్ అధికారులు సద్దాం ఉస్సేన్, ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.