అదిలాబాద్

అంబేద్కర్ ఆశయాలతో సాగుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, అక్టోబర్ 22: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతున్నామని రిజబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ హతావలే పేర్కొన్నారు. ఆదివారం ఆయన పట్టణంలో పర్యటించారు. ముందుగా ఆర్‌ఆండ్‌బి గెస్ట్‌హౌస్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి బిజెపి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. పట్టణంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి కేంద్రమంత్రి హాజరయ్యారు. అనంతరం సంతోష్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. దళితులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రదాని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. తెలంగాణలో కూడా తమ ఆర్‌పిఐ పార్టీని ప్రజల్లోకి తీసుకెల్తామన్నారు. అంతకు ముందు స్థానిక చెక్ పోస్టు వద్ద కేంద్ర మంత్రికి జిల్లా కలెక్టర్ చంపాలాల్, బిజెపి జిల్లా అధ్యక్షుడు జెబి పౌడేల్, నాయకులు విజయ్‌సింగ్ తదితరులు స్వాగతం పలికారు. డిఎస్పీ హబీబ్‌ఖాన్ ఆధ్వర్యంలో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో ఆర్‌పిఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలేష్ గౌడ్, వివిధ జిల్లాల నాయకులు రాంటెంకి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అన్నివర్గాల అభివృద్ధే టిఆర్‌ఎస్ ధ్యేయం
* బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 22: అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయా పార్టీల నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం జోగు రామన్న నివాసంలో ఎంఐఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఖయ్యుంరాజ అధ్వర్యంలో సుమారు వందమంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ముస్లీం మైనార్టీల అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. షాదీ ముబారక్, మైనార్టీ గురుకులాల విజయవంతంగా అమలు కావడంతో పేద ప్రజలకు ఎంతగానో లబ్దిచేకూరుస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించాయని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలోనే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అన్ని వర్గాలను సమన్యాయంతో అభివృద్ధిపర్చడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధినిచూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, డెయిరీ కార్పోరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు అడ్డి బోజారెడ్డి, సాజిద్‌ఖాన్, కౌన్సిలర్లు సత్యనారాయణ, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.