అదిలాబాద్

చట్టానికి ఎవరూ అతీతులు కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 16: చట్టం దృష్టిలో సమాజంలోని అన్ని వర్గాలు సమానమేనని, పేద ధనిక తేడా లేకుండా రాజ్యాంగ చట్టాల ప్రకారమే సమన్యాయం కల్పించడం జరుగుతుందని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక అన్నారు. గురువారం స్థానిక న్యాయస్థాన ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎక్సైజ్, జైలు అధికారుల సమక్షంలో ఉచిత న్యాయ సహాయం ఏవిధంగా పొందవచ్చనే శీర్షికతో రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక మాట్లాడుతూ ఈనెల 13 నుండి 18 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత న్యాయసహాయంపై ప్రజల్లో భారీ ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉచిత న్యాయం పొందడానికి అర్హులైన వారి వివరాలు వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు, తెగకు చెందినవారై ఉండాలని, మానవ అక్రమ రవాణా బాధితులు లేదా బేగారులు, స్ర్తిలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు ఉచిత న్యాయం పొందడానికి పూర్తి అర్హులుగా ఉంటారని తెలిపారు. వీరితో పాటు సామూహిక విపత్తు, హింసకాండ కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తుల వంటి వాటిలో చిక్కుకున్న వారు సైతం ఉచిత న్యాయం పొందవచ్చన్నారు. వార్షిక ఆదాయం లక్షకు మించని వ్యక్తులతో పాటు నిర్భందంలో ఉన్న బాధితులు సైతం ఉచిత న్యాయం పొందడానికి అర్హులేనని అన్నారు. పోలీసు కేసుల్లో రిమాండ్ అనంతరం జైల్‌లో ఉన్న నిందితుల కేసులను త్వరగా పరిష్కరించేందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్‌ను దాఖలు చేయాలని తెలిపారు. చిరకాలంగా కోర్టులందు అపరిష్కృతంగా నిలిచిపోయిన కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు శాఖ, జైల్, ఎక్సైజ్ అధికారులు న్యాయస్థానం వ్యవస్థకు సహకరించి త్వరితగతిన కేసుల పరిష్కరానికి తోడ్పడాలని తెలిపారు. న్యాయసేవ వాల్ పోస్టర్లను ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీసు స్టేషన్‌ల ముందు భాగంలో అమర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి జె.జీవన్‌రావు, జిల్లాల కలెక్టర్లు డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, ఆర్‌వి కర్ణన్, కె. ఇలంబర్తి, ఎస్పీలు ఎం.శ్రీనివాస్, సన్‌ప్రీత్‌సింగ్, విష్ణు ఎస్ వారియర్, మంచిర్యాల డిసిపి ఎంఎస్ వేణుగోపాలరావు, జిల్లా ఎక్సైజ్ అధికారులు నాగేందర్ రెడ్డి, ఆర్.కిషన్, డి.నర్సింహారెడ్డి, న్యాయస్థానం పిపి ఎం.రమణారెడ్డి, లైజన్ అధికారి వెంకటరావు, స్పెషల్ బ్రాంచ్ అధికారి అన్వర్ ఉల్ హఖ్ తదితరులు పాల్గొన్నారు.