అదిలాబాద్

నిరుపేదలకు టిఆర్‌ఎస్ చేసిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, నవంబర్ 16: టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్ళు కావస్తున్నా ఇప్పటివరకు నిరుపేదలకు చేసింది ఏమిటని పిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, గిరిజనులకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు, తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, గిరిజనులకు పోడు వ్యవసాయం పట్టాలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, రైతులకు రుణ మాఫిని పేరుతో ప్రజల సొమ్మును బ్యాంకులకు దోచిపెట్టారే తప్ప రుణమాఫితో రైతులకు ఒరిగింది ఏమిలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపి పార్టీల నుండి టిఆర్‌ఎస్ పార్టీల్లో చేరుతున్న వారు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు చేసిందేమిటో ఒకసారి గమనించాలని, ఆ పార్టీలో చేరుతున్న వారిని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హాయాంలో నిరుపేదల ఇండ్ల స్థలాల కోసమని వాంకిడి మండల కేంద్రంలో 14ఎకరాల స్థలం కొని పంపిణీ చేస్తే ఇప్పటి వరకు వారికి కనీసం ఇంటి పట్టాలు ఇప్పించలేదని నాయకులు ఫుకట్‌నగర్‌లో డబుల్‌బెడ్‌రూం కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోయినా, ఖాళీగా ఉన్న స్థలంలో ఇండ్ల నిర్మాణం చేపట్టి లాటరీ పద్ధతిలో ఇండ్లు ఇస్తామని చెప్పినా దీని వల్ల ఎవరికీ లాభం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రైతు సమితిలను ఏర్పాటు చేసి అందులో సైతం టిఆర్‌ఎస్ కార్యకర్తలను నింపి రుణాలు, విత్తనాలు, ఎరువులు ఇప్పిస్తామని అనడం ఇది ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ధైర్యంగా ఉండాలి 2019 మనదే
మండల కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని రానున్న 2019లో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని, అప్పటి వరకు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే, పిసిసి ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మండలంలో గ్రామ పంచాయతీల వారీగా బూత్ కమిటీలను పూర్తిచేయడంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.పూర్తి స్ధాయిలో గ్రౌండ్‌వర్క్ చేసి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుడిలా పనిచేయాలని,పార్టీ కోసం పనిచేసేన వారికి గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు పంచాయతీ అద్యక్షులుగా ఇటీవల ఎన్నికైన వారికి సక్కు గుర్తింపు పత్రాలను అందచేశారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండోకర్ దాదాజి,మండల ఇంచార్జీ గుర్నులే నారాయణ,కార్యదర్శి కుర్ర బాబురావు, వాంకిడి జిపి అద్యక్షుడు ఎర్మి తేజ, బంబార జిపి అధ్యక్షుడు సోయం గోపాల్, నాయకులు షఫి, ఎండి చాంద్‌పాషా, రషీద్, రాము, ఉప్రే అశోక్, ఇంద్రజిత్ తదితరులున్నారు.