అదిలాబాద్

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, నవంబర్ 16: అడవుల్లో మావోయిస్టులు సాధించేది ఏమీ లేదని జనజీవన స్రవంతిలో కలవాలని బెల్లంపల్లి ఏసీపి బాలుజాదవ్ తెలిపారు. గురువారం బెల్లంపల్లి పట్టనంలోని కన్నాల బస్తీలో మావోయిస్టు పార్టిలో పని చేస్తున్న సెంట్రల్ కమిటి సభ్యుడు కటకం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ తల్లి వెంకటమ్మను కన్నాల బస్తీలో బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ పరామార్శించారు.సుదర్శన్ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్దురాలైన వెంకటమ్మ అనారోగ్యంతో బాదపడుతుందని, కటకం సుదర్శన్ జన జీవన స్రవంతి లోకి రావాలని ఆయన తల్లి కోరుకుంటుందని తెలిపారు. అజ్ఞాతంలోకి వెల్లి 40 సంవత్సరాలు గడిచిందని అడవిలో ఉండి తుపాకీ పట్టి సాదించేది ఏమీ లేదని తెలిపారు. జన జీవన స్రవంతిలో కలిస్తే వారి మీద ఉన్న రివార్డులను వారికే అందించి వారికి అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. అనంతరం వెంకటమ్మకు చీర, దుప్పట్లు, పండ్లుల పంపిణీ చేశారు. ఏసీపీ వెంట వన్ టౌన్ ఇన్స్‌పెక్టర్ నాగరాజు తదితరులు ఉన్నారు.

ఆకాశంలో అద్బుత దృశ్యం
బోథ్, నవంబర్ 16: మండలంలోని సోనాల గ్రామం నుండి బజార్‌హత్నూర్‌కు వెళ్లే రహదారిలో గురువారం సాయంత్రం సూర్యుడు హస్తమించే సమయంలో ఆకాశంలో మబ్బులతో కూడిన మహావృక్షం కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజలు అశ్చార్యానందానికి గురయ్యారు.

పోలీసులు ప్రజలతో మమేకం కావాలి
తాండూర్, నవంబర్ 16: పోలీసులు ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ అన్నారు. మండలంలోని మాదారం పోలీస్ స్టేషన్‌ను గురువారం ఏసీపీ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీసులు నిర్వహించిన కవాత్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేసి పోలీసుల పని తీరు, కేసుల గురించి ఏస్ ఐ రాములు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసీపీ విలేకర్లతో మాట్లాడుతూ శాంతి భద్రతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాత నెరస్తులు, మాజీ మిల్టెన్ లు అసాంగీక శక్తులపై ఎప్పుడు నిఘా ఉంచుతున్నామన్నారు. అదే విదంగా తూర్పు జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేక పోయినప్పటికీ నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. పోలీసులు జనమైత్రి సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెల్లి పరిష్కరించాలని సూచించారు. అదే విదంగా నిఘా కెమేరాలను ఏర్పాటు చేయడం వలన నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. వ్యాపారులు వాణిజ్య సంస్థల యజమానులు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.