అదిలాబాద్

రవాణా సౌకర్యంతో గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దహెగాం, ఏప్రిల్ 8: మారుమూల ప్రాంతాలకు రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం కల్పించడంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని ఒడ్డుగూడ, చిన్నరాజ్‌పల్లి, గెర్రె, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతా లు అభివృద్దికోసమే రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గెర్రె సమీపంలో అసంపూర్తిగా ఉన్న ఎర్రవాగు వంతెనను పరిశీలించారు. వంతెన నిర్మాణానికి రూ.10.50 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. వంతెన నిర్మాణ పనులను సదరు కాంట్రాక్టర్ త్వరలో ప్రారంభిస్తాడని పేర్కొన్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే వేమనపల్లి, దహెగాం మండలానికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. భద్రాచలం నుంచి కౌటాల వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. పలు గ్రామాల్లోని ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలు గ్రామాల్లోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ కొమురగౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ తిరుపతి గౌడ్, సర్పంచ్‌లు బానక్క, పెంటమ్మ, మల్లేష్, జయేందర్, బాలకిషన్‌రావు, ఎస్సై డీకొండ రమేష్, ఎస్సై సుధాకర్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.