అదిలాబాద్

తెలుగు భాష గొప్పది: జేసీ అశోక్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, డిసెంబర్ 14: ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పదని కుంమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక తెలుగు సాహితి సదస్సు ఆద్వర్యంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సభల సందర్భంగా ఆయన మాట్లడుతూ సరళంగా ఉన్న మన భాష గుర్తింపు పొందటం గొప్ప విషయం అన్నారు. ఇంతటి ఔనత్యం కలిగిన తెలుగును గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. రేపటి నుండి జరిగే ప్రపంచ తెలుగు మహా సభలకు వెల్లే వారి కోసం అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు తెలిపారు. కాగజ్‌నగర్ తెలుగు సాహితి సదస్సు అద్యక్షుడు బాస్కర శర్మ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌లో తెలుగు మహా సభలు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా కవులను సన్మానించడం ఎంతో మంచి విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాం మోహన్, ఎంఈవో భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి మదూకర్, కవులు కిషన్, మోహన్, రాజయ్య, రాజేందర్ శర్మ, నారాయణ గౌడ్, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.