అదిలాబాద్

సంబురంగా దుర్ముఖి ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 8: తెలుగు సంవత్సరాది దుర్ముఖినామ ఉగాది పండగను జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంప్రదాయ రీతిలో సంబరంగా జరుపుకున్నారు. తీపి చేదు రుచులను పంచిపెట్టిన మన్మదనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా దుర్ముఖినామ ఉగాదికి స్వాగతిస్తూ పల్లెపట్నం ప్రాంతాల్లో వేడుకలు అంబరాన్ని తాకాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతులకు ప్రీతిపాత్రమైన ఉగాది సంధర్భంగా వేకువ జామునే వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించి పంట చేలలో ఆరుకొని కొత్త ఖరీఫ్ సీజన్‌కు రైతులు శ్రీకారం చుట్టారు. రైతు కుటుంబాల్లో ఉగాది పండగ ఉషస్సును నింపినట్లయింది. పల్లెల్లో ఆరుకోవడం ద్వారా సాంప్రదాయ విలువలకు పట్టం కడుతూ కొత్త సంవత్సరం నుండి పనులకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే, ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న, కలెక్టర్ జగన్మోహన్ తమ నివాస గృహంలో ఉగాది వేడుకల్లో పాలుపంచుకొని జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్‌లోని రవీంద్రశర్మ విడిది చేసే ఆశ్రమంలో సంప్రదాయ ఉగాది పండగ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వివిధ వర్సిటీలకు చెందిన విద్యార్థులు, స్థానిక ప్రముఖులు ఈ వేడుకల్లో పాలుపంచుకొని నవధాన్యాలతో నిర్వహించిన హోమక్రతువను సందర్శించి పూజలు నిర్వహించారు. అక్కడే పురాతన వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించి సాంప్రదాయ ఉగాదికి గురూజి రవీంద్రశర్మ స్వాగతం పలికారు. ఆదిలాబాద్‌లోని పురాతన మంగమఠంలో, గోపాల కృష్ణ ఆలయంలో ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ పంచాంగ కర్త చికిలి వెంకటేశ్వర సిద్దాంతి పంచాంగ శ్రవణం పఠించి, ఈ ఏడాది అంతా శుభమే జరుగుతుందని పేర్కొన్నారు. వర్షాలు సవృద్ధిగా కురుస్తాయని, అయితే వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని, గత ఏడాదికంటే ఈసారి కాస్త అనుకూలంగానే ఉందని వివరించారు. ఆదిలాబాద్‌లోని ఆర్‌ఎస్‌ఎస్, ఏబివిపి, బిజెపి, హిందూ ఉత్సవ సమితి అధ్వర్యంలో ఉగాది వేడుకలు అంబరాన్ని తాకాయి. ప్రాచీన పండగలను ఘనంగా జరుపుకొని హిందూ ధర్మ విశిష్టతను చాటిచెప్పాలని పలువురు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో పట్టణంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.