అదిలాబాద్

సంతకం ఫోర్జరీ కేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 14: మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ కేసులో నిందితులను పట్టుకున్నామని పట్టణ ఎస్ ఐ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకానే్న ఫోర్జరీ చేశాడని అన్నారు. ఊట్నూర్‌కు చెందిన ఒక చానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్న కలమడుగు సంతోష్ అనే వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాల్లో, ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మంది అమాయకులనుండి లక్ష్యల రూపాయలు తీసుకుని దొంగ నియమక పత్రాలు సృష్టించాడని అన్నారు. అందులో భాగంగానే నెనె్నల మండల పీహెచ్‌సీలో ఖాళీగా ఉన్న స్ట్ఫా నర్స్ పోస్టును అధిలాబాద్‌కు చెందిన సుంకె రాజమణికి ఇప్పిస్తానని నమ్మబలికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రొసిడింగ్ ఇచ్చినట్లు లేఖను సృష్టించాడని తెలిపారు. ప్రొసిడింగ్ తీసుకున్న రాజమణి నెనె్నల పీహెచ్‌సీలో సంప్రదించగా అక్కడి అధికారులు జిల్లా వైద్యాధికారిని కలవాలని సూచించారు. వివరాలు తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి భీష్మ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెల్లడంతో సంతకం ఫోర్జరీ అయినట్లు తెలియడంతో మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన కలమడుగు సంతోష్, ఉద్యోగం కోసం వెతుకుతున్న సుంకె రాజమణిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నామని ఎస్‌ఐ తెలిపారు.