అదిలాబాద్

మారుమూల గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 14: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి గురువారం బేల, నార్నూర్ ఏజెన్సీ పల్లెల్లో ఆకస్మికంగా పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులు, ప్రజల సమస్యలపై ఆరా తీశారు. జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించడంతో గిరిజనులు పులకించిపోయారు. బేల మండలంలోని సదల్‌పూర్ బైరందేవుని ప్రాచీన ఆలయాన్ని ముందుగా సందర్శించిన కలెక్టర్ అక్కడి గిరిజనుల సాంప్రదాయ పూజలు, జాతర విశేషాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా బైరందేవుని ప్రాశస్తాన్ని అడిగి తెలుసుకున్నారు. పురాతన ఆలయాలను, ప్రాచీన కట్టడాల సంపదను పరిరక్షించుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వపరంగా ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సదల్‌పూర్‌లో గిరిజనులు స్వచ్చ్భారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, గతంలో పెండింగ్‌లో నిలిచిపోయిన మరుగుదొడ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. అయితే బేల కళాశాల నుండి సదల్‌పూర్‌కు వెళ్లే రహదారిపైనే 1/70 చట్టానికి విరుద్దంగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారని, మహిళలు ముఖ్యంగా కళాశాల విద్యార్థినిలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఏజెన్సీ గ్రామంలో నిబంధనలకు విరుద్దంగా వైన్‌షాపు ఉంటే తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామంలో అభివృద్ది పనులు వేగిరపర్చేలా గ్రామస్తులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంధర్భంగా డోలు వాయిద్యాలతో కలెక్టర్‌కు గ్రామస్తులు స్వాగతం పలికారు. సాంప్రదాయ పూజలు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ నార్నూర మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఝరి నుండి పిప్రి వరకు సి ఆర్ ఆర్ నిధుల నుండి నిర్మించిన 2.9కోట్ల రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించి, నాణ్యత గురించి ఆరా తీశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ఉద్దేశంతోనే రోడ్లు, వంతెనలు ఏర్పాటు చేశామని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ రోడ్డు మార్గమద్యంలోనే గ్రామస్తుల కోరిక మేరకు కోటి 50లక్షల నిధులతో నిర్మించిన వంతెన పనులను కలెక్టర్ పరిశీలించారు. అక్కడి పంచాయతీ రాజ్ అధికారులను నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఈ సంధర్భంగా ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పించారు.