అదిలాబాద్

గడువులోగా భూసర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్నూర్, డిసెంబర్ 14: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వేను గడవులోగా పూర్తిచేసి రైతులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. గురువారం గాధిగూడ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. భూసర్వేలో అధికారులు ఆర్జీలు శ్రీకరించి అర్హతకలిగిన రైతులకు ధృవీకరణ పత్రాలు వెంటనే అందించాలని, సాంగ్వీ గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సర్వేలో చెరువుల పునరుద్దరణ ఏలాంటి మార్పులు లేకుండా, అక్రమణలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాంగ్వీ పంచాయతీలో 408 పట్టాపాసు బుక్‌లు ఉంటే అసైన్డ్ భూములు అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వివాధాలను పారదర్శంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదే గ్రామంలో నలుగురు నిరుద్యోగులకు భూసర్వేలో సహకరించాల్సిందిగా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు లోకారికె గ్రామంలో కొనసాగుతున్న డబుల్‌బెడ్‌రూం పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి, డిప్యూటి సబ్‌కలెక్టర్ సిడాం దత్తు, అదనపు డి ఎం ఆండ్ హెచ్‌వో కుమ్రబాలు, ఐటిడిఏ డిడి పోశం, స్థానిక సర్పంచ్ మెస్రం లచ్చు, తహసీల్దార్ సంధ్యరాణి, ఎంపిడీవో శివ్‌లాల్, ఆర్‌డబ్ల్యూఎస్ జెఈ శ్రీనివాస్, పిఆర్ జెఈ లింగన్న, ఏపివో రజినికాంత్ తదితరులు పాల్గొన్నారు.